Sunday, December 22, 2024

బిజెపి పార్టీపైన కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా పోరాటం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి పార్టీపైన కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా గట్టిగా పోరాటం చేస్తుందని టిపిసిసి ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బిఆర్‌ఎస్, బిజెపి బంధం ఎంత ధృడంగా ఉందో అందరికీ అర్ధంమయ్యిందన్నారు. రేవంత్ రెడ్డిని చూస్తే కొందరికీ భయం పట్టుకుందన్నారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక అర్హత బిజెపి, బిఆర్‌ఎస్ నాయకులకు లేదన్నారు. గాంధీ చరిత్రకు మీ కుటుంబ చరిత్రకు పోలిక ఉందా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో హామీ ఇచ్చాక నెల రోజుల్లో హామీలను అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని ఆయన పేర్కొన్నారు. గత ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీల గురించి నెమరేసుకోవాలని ఆయన సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News