ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను ప్రవేశపెట్టిన కొంత కాలానికే ఆ పద్ధతి మీద పలు రాజకీయ పక్షాలు సందేహాలు వ్యక్తం చేయడం
మొదలైంది. ఇవాళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ ను గట్టిగా సమర్థిస్తున్న కొన్ని రాజకీయ పక్షాలు ఒకప్పుడు ఇంటి పైకప్పు ఎక్కి ‘ఈ పద్ధతి తప్పుల తడకగా ఉంది మాకు మళ్ళీ పేపర్ బ్యాలెట్ కావాలి’ అని అరిచి గీపెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రధాన రాజకీయ పక్షాలు గత 10 ఏళ్ల కాలంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ పట్ల అనేక అనుమానాలు
వెలిబుచ్చుతున్న విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వం ఆ తర్వాత గడువు కంటే ముందు 2018 లోనే ఎన్నికలకు వెళ్ళింది. ఆనాటి ఫలితాలు అనుమానాల్ని రేకెత్తించాయి. పోలైన ఓట్ల కంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఓట్ల లెక్కింపు జరగడం అనుమానాలకు తావిచ్చింది. అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ భారీ మెజారిటీతో ఎక్కువ స్థానాలను గెలుచుకోవడం వాస్తవ
పరిస్థితికి భిన్నంగా ఉందనే విమర్శలు కూడా వచ్చాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను అధికారంలో ఉన్నవాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని అనుమానాలు బలపడటం మొదలైంది. ఆ తర్వాత కొద్ది మాసాలకే 2019లో జరిగిన లోకసభ ఎన్నికలలో ఫలితాలు మరిన్ని అనుమానాలకు దారితీసాయి.
అది 1983 సార్వత్రిక ఎన్నికల సమయం.. భారతదేశంలో అప్పుడప్పుడే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నారు. ఆ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని అప్పటి మహబూబ్ నగర్ జి ల్లాలో ఉన్న షాద్‌నగర్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారా పోలింగ్ జరిగింది. ఆ కారణంగానే ఆ ఎన్నికల ఫలితాల రోజున లెక్కింపు మొదలైన మొ దటి గంటలోనే షాద్ నగర్ ఫలితం వెలువడి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ శంకర్రావు గెలుపొందారు. బోణీ కాంగ్రెస్ చేయడంతో ఇంకేముంది అప్పుడే పుట్టిన తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు ఉండవని ఎన్‌టీ రామారావు అల్లుడు నారా చం ద్రబాబు నాయుడుతో సహా కాంగ్రెస్ వారంతా భావించారు. ఆ భావనను తలకిందులు చేస్తూ తర్వాత దాదాపు 100 ని యోజకవర్గాలవరకు కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదు. ఆ ఎన్నికల్లో ఎన్టీ రామారావు అప్పుడే స్థాపించిన తెలుగుదేశం పార్టీ అత్యద్భుత విజయాన్ని సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లవల్ల ఓట్ల లెక్కింపు సుల భం అవుతుంది, ఫలితం త్వరగా వెలువడుతుందన్న విషయం ఆరోజు అందరికీ అర్థం అయిపోయింది. తర్వాతి కాలంలో దేశంలో దశలవారీగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ ను ప్రవేశపెట్టి చివరికి పేపర్ బ్యాలెట్ లేకుండానే మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ కు పోతున్న సంగతి కూడా అందరికీ తెలుసు.
అమెరికా అభివృద్ధి చెందిన దేశాలతో సహా పలు ఇప్పటికీ పేపర్ బ్యాలెట్‌నే వాడుతున్నారు. భారతదేశంలో మాత్రం టెక్నాలజీని అందిపుచ్చుకొని సులువైన మార్గంలో ఎన్నికలు నిర్వహించగలుగుతున్నామని చెప్పి గర్వపడు తూ ఉండేవాళ్ళం నిన్నటిదాకా. అందుకు కారణాలు అనేకం. పేపర్ బ్యాలెట్ వల్ల ఓట్ల లెక్కింపునకు చాలా సమ యం పడుతుందనే విషయంతోపాటు దుండగులు దాడిచేసి వాటిని చిం చేసే, కాల్చేసే అవకాశం కూడా ఉండేది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతి రాక మునుపు ఓట్ల లెక్కింపు ఒక పెద్ద కార్యక్రమంగా ఉండేది. పూర్తి ఫలితాలు వెలువడడానికి కనీసం రెండున్నర రోజులు పట్టేది. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని ఒక విభాగంలో విలేకరులు కూర్చుని ఎన్నికల ఫలితాలను తెలుసుకోవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసేది. వంతులవారీగా డ్యూటీలు వేసుకుని విలేకరులు రెండు రోజులపాటు సచివాలయంలో ఉండి పోవాల్సిన పరిస్థితి.
అయితే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను ప్రవేశపెట్టిన కొంత కాలానికే ఆ పద్ధతి మీద పలు రాజకీయ పక్షాలు సందేహాలు వ్యక్తం చేయడం మొదలైంది. ఇవాళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ ను గట్టిగా సమర్థిస్తున్న కొన్ని రాజకీయ పక్షాలు ఒకప్పుడు ఇంటి పైకప్పు ఎక్కి ‘ఈ పద్ధతి తప్పుల తడకగా ఉంది మాకు మళ్ళీ పేపర్ బ్యాలెట్ కావాలి’ అని అరిచి గీపెట్టిన సం దర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రధాన రాజకీ య పక్షాలు గత 10 ఏళ్ల కాలంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ పట్ల అనేక అనుమానాలు వెలిబుచ్చుతున్న విషయం తెలిసిందే.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మొరాయించడం, పనిచేయకపోవడం వంటివి చిన్నచిన్న సమస్యలు. వాటిపట్ల ఓటర్లలో నమ్మ కం కలిగించడానికి, రాజకీయ పక్షాలు కూడా వాటిని నమ్మడానికి ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన ఒక పద్ధతి వివి ప్యాట్లు. మన ఓటు ఎవరికి వేసామన్నది ఆ వివి ప్యాట్లల్లో ముద్రితమై ఉంటుంది. యంత్రం తప్పు చేసిందని ఎవరైనా అనుమానపడితే వివి ప్యాట్లను లెక్కించి వారి అనుమానాలను నివృత్తి చేయాలి. ఇదంతా ఒక ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్య పద్ధతి. ఇటువంటి ప్రజాస్వామ్య సాంప్రదాయాలని కాపాడవలసిన బాధ్యత స్వయం ప్రతిపత్తి కలిగి ఉండే కేంద్ర ఎన్నికల సంఘానిది, దానికి బాధ్యులైన అధికారులు అందరిదీ కూడా.
అయితే గత కొంతకాలంగా ఇందుకు భిన్నమైన పరిస్థితి దేశంలో నెలకొని ఉండడమే కొన్ని రాజకీయ పక్షాలు ఆందోళన వెలిబుచ్చడానికి కారణం అయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వం గడువు కంటే ముందు 2018 లోనే ఎన్నికలకు వెళ్ళింది. ఆనాటి ఫలితాలు అనుమానాల్ని రేకెత్తించాయి. పోలైన ఓట్ల కంటే చాలా ఎక్కు వ సంఖ్యలో ఓట్ల లెక్కింపు జరగడం అనుమానాలకు తావిచ్చింది. అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ భారీ మెజారిటీతో ఎక్కువ స్థానాలను గెలుచుకోవడం వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉందనే విమర్శలు కూడా వచ్చాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను అధికారంలో ఉన్నవాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని అనుమానాలు బలపడటం మొదలైంది. ఆ తర్వాత కొద్ది మాసాలకే 2019లో జరిగిన లోకసభ ఎన్నికలలో ఫలితాలు మరిన్ని అనుమానాలకు దారి తీసాయి.
అక్కడి నుండి వరుసగా ఎక్కడో ఏదో ఒక మూల ఒక రాజకీయ పక్షం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల మీద సందేహాలు వెలిబుచ్చడం సర్వసాధారణంగా మారింది. బాధ్యతగా వ్యవహరించవలసిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి పూర్తి ప్రయత్నం ఏనాడూ చేయలేదు. 2024లో లోకసభ ఎన్నికలతోపాటు శాసనసభకు ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. అక్కడి ఎన్నికల సంఘం, దాని అధికారులు వ్యవహరించిన తీరు పలు అనుమానాలు కలిగిస్తున్నదని చెప్పి అక్కడి ప్రస్తుత ప్రతిపక్షం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఆ విషయంలో ఆ పార్టీ పలు ఉదాహరణలు పేర్కొంటోంది. ఫిర్యాదులు కూడా చేస్తోంది. కొన్ని జిల్లాలలో, కొన్ని నియోజకవర్గాలలో ఓటింగ్ సరళి, తర్వాత జరిగిన లెక్కింపు వ్యవహారంలో
అనేక అనుమానాలను పార్టీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువచ్చింది, కోర్టులలో కేసులు కూడా వేస్తోంది. తాజాగా జరిగిన హర్యానా ఎన్నికల ఫలితాలు, నిన్నగాక మొన్న వెలువడిన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల మీద అనుమానాలు రేకెత్తించే విధంగా ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి సర్వే సం స్థలు చేసిన అంచనాలు పూర్తిగా తారుమారై అప్పటి అధికారపక్షం 11 స్థానాలకు పరిమితం కావడం అనేది అనేక అనుమానాలకు తావిచ్చింది. ఎంతటి ప్రభుత్వ వ్యతిరేకత పని చేసి ఉన్నా కొన్ని సీట్లు తగ్గి ఉండేవేమో కానీ పూర్తిగా 151 స్థానా ల నుంచి 11 స్థానాలకు పడిపోవడమనేది ఎన్నికల సంఘానికి కూడా అనుమానాలు వచ్చి ఉండవలసిన పరిస్థితి. అదేమీ జరగకపోగా కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా తనను తాను సమర్ధించుకునే పనిలో పడిపోయింది.
హర్యానా ఎన్నికల విషయంలో కూడా సర్వే సంస్థలన్నీ ఎగ్జిట్ పోల్స్ లో అక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని ఒక అంచనానిచ్చాయి. ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి. మొన్నటి మహారాష్ట్ర ఉదాహరణ తీసుకుందాం. కొద్ది మాసాల క్రితం జరిగిన లోకసభ ఎన్నికల్లో అక్కడ ప్రతిపక్షంలో ఉన్న మహా వికాస్ అఘాడీ మంచి ఫలితాలు సాధించిన విషయం తెలిసిందే. శాసనసభ ఎన్నికల్లో వచ్చేసరికి అందరూ భావించింది అప్పటి ఫలితాలే మళ్లీ పునరావృతం అవుతాయని. అందుకు భిన్నంగా మహాయుతి అత్యద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి రావడం సందేహాలకు తావిచ్చింది. ఈ అన్ని సందర్భాలలో కూడా కామన్ గా వస్తున్న ఒక ఫిర్యాదు ఏమిటంటే పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఎలా ఉంటాయని. దీనికి సరైన సమాధానం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు చెప్పలేకపోతున్నారు. లేదా చెప్పడానికి ఇష్టపడటం లేదు.
ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వివాదంపై మాజీ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్.వై. ఖురేషి కీలక సందేహాలు వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఒక ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహారాష్ట్రలో పోలింగ్ రోజున సాయంత్రం ఐదు గం టలకల్లా 55 శాతం ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ మర్నాడు ఈసీ ప్రకటించిన తుది గణాంకాల్లో ఏకంగా 66.5 శాతానికి ఎలా పెరిగిపోయింది అన్న అంశం మీద ఆయన మాట్లాడుతూ ఇంత వ్యత్యాసం ఉండ డం ఆందోళన కలిగించే అంశం అని చెప్పారు. ఓటింగ్ శాతం గణాంకాలు ఎప్పటికప్పుడు నమోదు అవుతూ ఉంటాయని ఆ యన పేర్కొన్నారు. అటువంటప్పుడు పోలింగ్ నాటి సాయంత్రానికి, మరునాడు లెక్కించేటప్పటికీ ఇంతటి వ్యత్యాసం ఎట్లా సాధ్యమవుతుందని ఆయన సందేహం వ్యక్తం చేసారు. పోలింగ్ సందర్భంగా ఓట్ల సంఖ్యను నమోదు చేయడానికి అనుసరించే పలు పద్ధతులను ఆయన ఇంటర్వ్యూలో వివరించారు . ఫారం 17 సీలో నమోదయ్యే వివరాలు మరునాటికి ఎలా మారుతాయని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికి, తుది పోలింగ్ శాతానికి మధ్య 12.54 శాతం పెరుగుదల ఉండడం కూడా పలు అనుమానాలకు తావిచ్చిన విషయం తెలిసిందే. ఒరిస్సా రాష్ట్రంలో కూడా ఇటువంటి ఫిర్యాదులు వచ్చాయి.
ఇలా పోలింగ్ శాతం పెరగడానికి ఈవీఎంలను హ్యాకింగ్ చేయడం, ఈవీఎంలను మార్చేయడం, ఈవీఎంలు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల అయి ఉండవచ్చని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారమ్స్ వంటి సంస్థలు చెప్తున్నాయి. ఈవీఎంల పనితీరు పట్ల సమాజ్ వాది పార్టీ నాయకుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఒక మాట చెప్పారు. ‘ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఎనభయ్ లోకసభ స్థానాల్లో మా పార్టీ గెలిచినా సరే నేను ఈవీఎంల పనితీరును అనుమానిస్తాను’ అని ప్రకటించారు. ఇలా దేశంలోనే అనేక ప్రధాన రాజకీయ పక్షాలు ఈవీఎంల పట్ల అనుమానాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ముందుకొచ్చి వీటన్నిటిని నివృత్తి చేయడం కోసం ఒక పద్ధతి ప్రకారం మాట్లాడి ఉంటే వివరణలు ఇచ్చి ఉంటే బాగుండేది.
ఈ దేశంలో అత్యంత స్వతంత్రంగా వ్యవహరించవలసిన వ్యవస్థ కేంద్ర ఎన్నికల సంఘం. అటువంటి వ్యవస్థ స్వయం ప్రతిపత్తి మీద సందేహాలు కలగడం అనేది దేశ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన భారత ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉన్నది. అన్ని రాజకీయ పక్షాలు ఒక చోట కూర్చుని ఈ పరిస్థితిని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచంలోని ఎన్నో దేశాలు అనుసరిస్తున్న విధంగా అవసరమైతే పేపర్ బ్యాలెట్ కు వెళ్ళవచ్చు కూడా. కనీసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఎన్నికల ప్రక్రియ మీద దేశ ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి.
ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయన్న అ నుమానాలు నిజమే గనుక అయినట్లయితే ఎక్కువగా నష్టపోయేది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల వ్యవస్థ సరిగా ఉండేట్టు చూడటానికి ఇతర పార్టీలనుకూడగట్టుకుని పోరాటం చెయ్యాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీదే. ఎందుకంటే కేంద్రంలో అధికారం కోసం కొట్లాడుతున్న పార్టీ అది. కానీ ఎందుకో ఆ పార్టీ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించదు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అదాని అంశం ముఖ్యమా లేక ప్రజాస్వామ్య హననం జరగకుండా ఈవీఎంల వ్యవహారంలో జరుగుతున్న అవకతవకలను అరికట్టేందుకు పోరాడటం ముఖ్యమా అనేది చూడాలి.
దేవులపల్లి అమర్
డేట్ లైన్ హైదరాబాద్