Friday, December 20, 2024

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎంపికపై కాంగ్రెస్ విమర్శ

- Advertisement -
- Advertisement -

నమ్మకం కలిగించే చర్య కాదు
న్యూఢిల్లీ : పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు మంత్రి ఎంపిక నమ్మకం కలిగించేదిగా లేదని కాంగ్రెస్ మంగళవారం విమర్శించింది. గత దశాబ్దంలో పార్లమెంట్‌ను నడిపించిన తీరుకు భిన్నంగా సాగాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరుకుంటున్నా అందుకు తగినట్లుగా మంత్రి ఎంపిక లేదని పార్టీ వ్యాఖ్యానించింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రజల తీర్పును ప్రతిబింబించాలని ఇండియా కూటమి కృతనిశ్చయంతో ఉందని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

కిరణ్ రిజిజు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగానియుక్తుడు కాగా, అర్జున్ మేఘ్వాల్ ఆ శాఖలో సహాయ మంత్రిగా ఉంటారు. ‘1/3 ప్రధాని గత దశాబ్దంలో నిర్వహించిన తీరుకు భిన్నంగా పార్లమెంట్ సాగాలని ఏవిధంగా కోరుకున్నా పార్లమెంటరీ వ్యవహారాల శాఖలో కేటాయింపులు నమ్మకం కలిగించేవిగా లేవు’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు.

“దైవ’ సంకేతాలు ఏమైనప్పటికీ పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రజల తీర్పును ప్రతిబింబించాలని ఇండియా కూటమి కృతనిశ్చయంతో ఉంది’ అని రమేష్ తెలిపారు. ఈ ఎన్నికల్లో లోక్‌సభలో235 మంది సభ్యులతో మరింత బలంగా ఆవిర్భవించిన ప్రతిపక్ష ఇండియా కూటమి ధరల పెరుగుదల, నిరుద్యోగిత సహా ప్రజలకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వాన్ని ఢీకొనాలని భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News