Tuesday, November 26, 2024

అధికారం కోసం కాంగ్రెస్ నేతల పగటి కలలు: బండి సంజయ్‌కుమార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని వారంతా పగటి కలలు కంటున్నారని ఆయన సెటైర్లు వేశారు. ఆదివారం బండి సంజయ్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో కర్ణాటకను చూస్తే అర్థమవుతుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో అనేది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఓ ట్రైలర్ చూపించిందని సెటైర్లు వేశారు.

కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మతమార్పిడి వ్యతిరేక బిల్లును రద్దు చేసిందని, పాఠ్యపుస్తకాల్లో కేబీ హెడ్గేవార్, వీడీ సావర్కర్ పాఠాలను తొలగించిందని అన్నారు. బహుశా ఒసామా బిన్ లాడెన్, కసబ్ వంటి టెర్రరిస్టుల జీవిత చరిత్రను పాఠాలుగా పెడుతారా అని నిలదీశారు. కర్ణాటకలో రేషన్ బియ్యం పంపిణీ పథకం చాలా లోపభూయిష్టంగా మారిందని అన్నారు. ఇక అదానీ విషయంలో రాహుల్ పెద్ద డ్రామా ఆచారని, కానీ ప్రస్తుతం అదానీ పెట్టుబడుల కోసం కర్ణాటక ద్వారాలు తెరిచిందని విమర్శించారు.

ఒకవైపు పింఛన్లు, ధరణి, సంక్షేమ పథకాలపై తెలంగాణలో అనిశ్చితి సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్ని చేస్తూ ప్రజల్లో అశాంతి సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగానికి కట్టుబడి ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే సామాజిక సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని, ఏమైనా లోపాలుంటే సరిదిద్దుతామని చెప్పారు. రాజకీయ నాయకులు, వాళ్ల కుటుంబాలకు కాక ప్రజలకు నేరుగా మేలు జరిగేలా బీజేపీ పాలన తెస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News