Monday, January 20, 2025

రైతుల నోట్లో మట్టి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సుల్తానాబాద్/ వెల్గటూర్: రైతులకు పంట పెట్టుబడి ఉపయోగప డే రైతుబంధు పథకాన్ని నిలుపుదల చే యించి కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతుల పొట్టకొట్టాడని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రె స్ పార్టీ అధికారంలోకి రాకముందే రైతు బంధును కాటగలిపి రైతుల నోట్లో మట్టిగొట్టింది. పొరపాటున ఆ పార్టీ అధికారంలో వస్తే రైతుబంధును మొత్తానికే ఎత్తగొడతా రు. కాంగ్రెస్, బిజెపి కలిసి కొత్త కుట్రకు తె రలెపి రైతుబంధును ఆపేశాయని అన్నారు. సోమవారం సుల్తానాబాద్‌లోని పూసాల రోడ్డులో నిర్వహించిన రోడ్డుషోలో పెద్దపల్లి బిఆర్‌ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి కెటిఆర్ మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏమీ చేయలేని కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం ఆరు గ్యారంటీలు అంటూ ఓట్లను అడుగుతోందని విమర్శించారు. ఆరు కాదు వెయ్యి గ్యారంటీలు ఇచ్చినా కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, తెలంగాణలో ముచ్చటగా మూడోసారి బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి మాటలకు అసలు గ్యారంటీ ఉండదని ఎద్దేవా చేసిన ఆయన వారి మాటలు నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. ఎంఎల్‌ఎగా పనిచేసిన కాలంలో నియోజకవర్గానికి ఏమీ చేయని కాంగ్రెస్ అభ్యర్థి సానుభూతి పొం దడం కోసం నానా వేషాలు వేస్తున్నాడని చురకలంటించారు. కోట్ల రూపాయలను పంచి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నించడం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లిలో దాసరి మనోహర్ రెడ్డి గెలుపుని ఏ శక్తి అడ్డుకోలేదని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు కారు గర్తుకు ఓటు వేసి బీఆర్‌ఎస్ పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.

ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా సిఎం కెసిఆర్ రైతులకు ముందస్తు పెట్టుబడి అందించేందుకు రైతు బంధు పథకం ప్రారంభించారని కెటిఆర్ అన్నారు. ఇప్పటికే 11సార్లు రైతుబంధు ఇచ్చామన్నారు. కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు అమలులో లేకపోగా అమలులో ఉన్న తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టడం సిగ్గు చేటన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. తనపై బురదజల్లి సానుభూతిని పొందాలని చూస్తున్న వారి ఆటలు కట్టిస్తానని పేర్కొన్నారు. తన గెలుపు కోసం కష్టపడి పని చేస్తున్న కార్యకర్తలను మరిచిపోనని, అందరి రుణం తీర్చుకుంటానని భరోసా కల్పించారు. దాసరి గెలవగానే గర్రెపల్లి, కొలనూర్, పెద్దపల్లి రూరల్ మండలాలు ఏర్పాటు చేస్తామని, ఎలిగేడులో పోలీస్ స్టేషన్ సైతం ఏర్పాటు చేస్తామన్నారు. రోడ్ షోలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఎంపీ వెంకటేష్‌తోపాటు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వేలాది సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

రైతు బంధును ఆపి రైతుల జీవితాలను చీకటి చేసే కుట్ర : కెటిఆర్
కెసిఆర్ రైతులకు అందిస్తున్న రైతుబంధు పథకాన్ని రద్దు చేసి రైతుల బతుకులను చీకటి చేసే కాంగ్రెసు పార్టీ కావాలో, రైతుల కోసం నిరంతరం శ్రమిస్తున్న సిఎం కెసిఆర్ కావాలో ప్రజలే ఆలోచించుకోవాలని కెటిఆర్ అన్నారు. సోమవారం వెల్గటూర్ మండల కేంద్రంలో ధర్మపురి నియోజకవర్గ బిఆర్‌ఎస్ అభ్యర్థి, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఏర్పాటు చేసిన రోడ్ షోలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ శ్రీరామ రక్ష కాగా ధర్మపురి నియోజకవర్గానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ శ్రీరామ శ్రీరక్షని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కెసిఆర్ ముఖ్యమంత్రి కావడంతోనే తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా ఎదిగిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తెలంగాణ చచ్చిపోతుందని తష్మాత్ జాగ్రత్త అని కెటిఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం లోని ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతాంగం ఉందన్న విషయం తెలిసిన మనిషిగా రైతాంగానికి కావలసి సౌకర్యాలపై దృష్టి పెట్టారని తెలిపారు. రైతులకు కావలసిన సాగునీటికై ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల కరెంట్, పంట సాయంగా రైతుబంధు పథకం, రైతు బీమా పథకం లాంటి సంక్షేమ పథకాలు ఇచ్చి పంట దిగుబడి పెంచిన ఘనత కెసిఆర్‌దేనని తెలిపారు. 24 గంటల కరెంట్ వద్దు, 3 గంటల కరెంట్ సరిపోతుందన్న కాంగ్రెసు కాంగ్రెసు పార్టీ రైతులను నట్టేట ముంచుతుందని అన్నారు. 11సార్లు అవకాశం ఇచ్చి ఓటు వేస్తే రైతులకు కాంగ్రెసు చేసింది ఏమిటని ప్రశ్నించారు. రైతుల ఎరువుల కొరత, నకిలీ విత్తనాలు, కరెంట్ కోతలు, ఆకలి చావులు, రైతు ఆత్మహత్యలు మిగిలాయని అన్నారు.

రైతుబంధు కావాలంటే రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని పిలునిచ్చారు. గోదావరి నది పరీవాహక ప్రాంతమైన దర్మపురి నియోజకవర్గంలో గల గ్రామాల మత్స కారులకు ఉద్యోగ అవకాలు కలిపించే విధంగా ఫిష్ ఫ్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటకు కృషి చేస్తామని అన్నారు. వెల్గటూర్ మండలంలో స్తంభంపల్లి గ్రామ శివారులో ఇథనాల్ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేసినామని తెలిపారు. ఆ ప్రాంతంలో వ్యవసాయ కళాశాల ఏర్పాటకు ముఖ్యమంత్రి కెసిఆర్ అనుమతి ఇచ్చారని గుర్తు చేశారు. ఐటి కళాశాల మంజూరు జరుగుతుందని విద్యార్థులకు, తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ధర్మపురి నియోజకవర్గం శ్రీరామ రక్షకుడు కొప్పుల ఈశ్వర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపి బోర్లకుంట వెంకటేష్‌నేత, వెల్గటూర్ ఎంపిపి కునమల్ల లక్ష్మి లింగయ్య, జడ్పిటిసి సభ్యురాలు, బి. సుధారాణి రామస్వామి, వెల్గటూర్ వ్యవసాయ మ్కాట్ కమిటీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్, పిఎసిఎస్ చైర్మన్‌లు గొళి రత్నాకర్, గూడ రాంరెడ్డి, యువత విభారం అధ్యక్షులు బిడారి తిరుపతి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు బిఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు చల్లూరి రాంచంద్రం గౌడ్, జూపాక కుమార్, నాయకులు పోనుగోటి రాంమోహన్‌రావు, గండ్ర విష్ణువర్దన్ రావు, గండ్ర నర్పింగారావు, మూగల సత్యం,కొప్పుల సురేష్,పెద్దూరి భరత్, రంగుతిరుపతి గౌడ్, అధిక సంఖ్యలో మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

KTR2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News