Saturday, December 21, 2024

సీడబ్ల్యూసీని పునర్ వ్యవస్థీకరిస్తూ కాంగ్రెస్ నిర్ణయం

- Advertisement -
- Advertisement -

మొత్తం 84 మందితో జాబితా విడుదల
సీడబ్ల్యూసీ జనరల్ సభ్యులుగా 39మందికి చోటు
18 మందిని సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులుగా, 14 మందిని ఇన్‌చార్జీలుగా,
9 ప్రత్యేక ఆహ్వానితులుగా, 4 ఎక్స్‌అఫిషియో సభ్యులకు చోటు

మనతెలంగాణ/హైదరాబాద్:  త్వరలో ఎన్నికలు జరుగనున్న వేళ కాంగ్రెస్‌పార్టీ సంస్థాగతంగా కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలిగా ఉన్న సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించింది. మొత్తంగా 84 మందితో విడుదల చేసిన జాబితాలో 39మందిని సీడబ్ల్యూసీ జనరల్ సభ్యులుగా ప్రకటించింది. ఇందులో కాంగ్రెస్ అధిష్టానం 18 మందిని సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులుగా, 14 మందిని ఇన్‌చార్జీలుగా, తొమ్మిది మందిని ప్రత్యేక ఆహ్వానితులు, నలుగురిని ఎక్స్‌అఫిషియో సభ్యులుగా పేర్కొంది. కాంగ్రెస్‌లో అసమ్మతి వర్గంగా పేరొందిన జీ23 నేతలైన శశిథరూర్, ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్ వంటి నేతలకు ఈ కమిటీలో చోటు కల్పించింది. సచిన్ పైలట్‌తో పాటు దీపాదాస్ మున్షీ, సయ్యద్ నసీర్ హుస్సేన్‌లను కొత్తగా సీడబ్ల్యూసీలోకి తీసుకున్నారు.

సీడబ్ల్యూసీ సభ్యులు

సీడబ్ల్యూసీ సభ్యులుగా మొత్తం 39 మందిని ఎంపిక చేసింది. ఈ జాబితాలో మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, అదిర్ రంజన్ చౌధురి, ఏకే ఆంటోనీ, అంబికా సోనీ, మీరాకుమార్, దిగ్విజయ్ సింగ్, పి. చిదంబరం, తారిక్ అన్వర్, లాల్ తన్దావాలా, ముకుల్ వాస్నిక్, ఆనంద్ శర్మ, అశోక్ చవాన్, అజయ్ మాకెన్, చరణ్ జిత్ సింగ్ చన్నీ, ప్రియాంకా గాంధీ వాద్రా, కుమారి సెల్టా, గైఖంగం, ఎన్. రఘువీరా రెడ్డి, శశిథరూర్, తమ్రాద్వాజ్ సాహు, అభిషేక్ మను సింఘ్వీ, సల్మాన్ ఖుర్షిద్, జైరాం రమేశ్, జితేంద్ర సింగ్, రణదీప్ సూర్జేవాలా, సచిన్ పైలట్, దీపక్ బబారియా, జగదీశ్ ఠాకూర్, జి.ఎ.మీర్, అవినాశ్ పాండే, దీపా దాస్ మున్షీ, మహేంద్రజిత్ సింగ్ మాలవీయ, గౌరవ్ గొగొయి, సయ్యద్ నసీర్ హుస్సేన్, కమలేశ్వర్ పటేల్, కేసీ వేణుగోపాల్‌లు ఉన్నారు.

Also Read: చనిపోయిన బాలుడు స్మశానంలో బతికాడు!

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News