Monday, December 23, 2024

గుజరాత్, హిమాచల్‌లో కాంగ్రెస్ ఓటమి తథ్యం

- Advertisement -
- Advertisement -

గుజరాత్, హిమాచల్‌లో కాంగ్రెస్ ఓటమి తథ్యం
ప్రశాంత్ కిషోర్ జోస్యం

Congress defeat in Gujarat and himachal pradesh

పాట్నా: ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిజెపి పాలిత రాష్ట్రాలు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవిచూడనున్నట్లు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శుక్రవారం జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు ఆ పార్టీలో చేరాలని కిషోర్ భావించినప్పటికీ ఆ ప్రయత్నాలు సఫలం కాలేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన సామాజిక మాధ్యమం ట్విట్టర్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ ఇటీవల నిర్వహించిన చింతన్ శిబిర్ ఎటువంటి అర్థవంతమైన ఫలితాన్ని సాధించలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఉదయపూర్ చింతన్ శిబిర్ గురించి వ్యాఖ్యానించాలని తనను పలువురు పదేపదే అడుగుతున్నారని, తన దృష్టిలో అది ఎటువంటి అర్థవంతమైన ఫలితాన్ని సాధించలేదని ఆయన అన్నారు. కేవలం కాంగ్రెస్ నాయకత్వ అంశంపై యథాతథ స్థితిని కొనసాగిస్తూ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో రానున్న ఎన్నికల ఓటమి కోసం ఎదురుచూస్తూ సమయాన్ని పొడిగించికోవడం తప్పించి చింతన్ శిబిర్ సాధించింది ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News