Friday, April 4, 2025

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ ప్రతినిధి బృందం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర  మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్‌ను కలిసింది. రాష్ట్రంలో గత పదిరోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని కాంగ్రెస్ బృందం గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వినతిపత్రం సమర్పించింది. సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో గవర్నర్ ను కలిసిన వారిలో ఎంఎల్‌ఎ శ్రీధర్ బాబు, వర్కింగ్ ప్రసిడెంట్స్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, మాజి పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి. హనుమంతరావు, మాజి ఎంపి మల్లు రవి, టిపిసిసి ఉపాధ్యక్షులు సంగిశెట్టి జగదీష్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News