హైదరాబాద్ : రాష్ట్రంలో 40 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని టిపిసిసి అధికార ప్రతినిధి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు బలమూరి వెంకట్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో 19,043 స్పష్టమైన ఖాళీలు ఉన్నాయని, ఉపాధ్యాయులకు పదోన్నతులు కలిపిస్తే అయ్యే ఖాళిలు , గతంలో మంజూరు చేసిన ప్రాధమిక పాఠశాలల హెడ్ మాస్టర్ల పోస్టులు 10 వేలు, భాష పండితులు, పిఈటి లు, గెజిటెడ్ హెడ్ మాస్టర్ పోస్ట్లులు అన్నింటిని అన్నీ కలిపి సుమారు 42 వేలు అవుతాయని తెలిపారు. వాటన్నింటిని భరీ చేయడానికి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. కేవలం 5,089 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ వేయడం సరైనది కాదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచుకున్నదే ఉద్యోగాల కోసమని, ఉన్న ఖాళీలు కూడా భర్తీ చేయకుంటే ఎలా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో 40 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి : కాంగ్రెస్
- Advertisement -
- Advertisement -
- Advertisement -