Friday, February 21, 2025

యుఎస్‌ఎఐడి నిధులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి : కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత్‌లో ఓటింగ్ శాతం పెంచుకునేందుకు యుఎస్‌ఎఐడి నిధులు అందుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ గురువారం తీవ్రంగా స్పందించింది. దీనిపై ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు అమెరికా నుంచి అందుతున్న నిధులపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ట్రంప్ వ్యాఖ్యలు అర్థంలేని ఆరోపణలే అవుతాయని ధ్వజమెత్తింది. 21 మిలియన్ డాలర్లు భారత్‌లో ఓటింగ్ శాతం పెంచుకోడానికి కేటాయించడమైందని, ఎందుకు మనం భారత్‌కు ఆ మొత్తం అందజేయాలని, భారత్‌లో మరెవరినో గెలిపించడానికి బైడెన్ ప్రభుత్వం ప్రయత్నించినట్టు అనుమానం కలుగుతోందని ట్రంప్ చేసిన ఆరోపణలకు కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జి, ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా కేంద్ర ప్రభుత్వం ఈ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. “ ఈ రోజుల్లో యుఎస్‌ఎఐడి ఎక్కువగా వార్తల్లో వస్తోంది. ఇది 1961 నవంబరు 3న ఏర్పాటైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీనిపై ఆరోపణలు అర్థం లేనివి ” అని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News