Wednesday, September 18, 2024

సుప్రీం అధీనంలోకి అదానీపై దర్యాప్తు..కాంగ్రెస్ డిమాండ్

- Advertisement -
- Advertisement -

అదానీగ్రూపు కంపెనీలపై వచ్చిన ఆరోపణల దర్యాప్తును సుప్రీంకోర్టు తన అధీనంలోకి తీసుకోవాలని, ఈ కుంభకోణం పూర్తి పరిధిని దర్యాప్తు చేసేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని(జెపిసి) ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ శుక్రవారం డిమాండు చేసింది. అదానీ బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి చెందిన 311 మిలియన్ డాలర్ల(రూ. 2,610 కోట్లు) బ్యాంకు ఖాతాలను స్విస్ అధికారులు స్తంభింపచేసినట్లు వచ్చిన వార్తలను కాంగ్రెస్ ఈ సందర్భంగా ఉటంకించింది. అదానీకి చాలాకాలంగా విశ్వాసపాత్రుడిగా వ్యవహరిస్తున్న చాంగ్ చుంగ్ -లింగ్‌కు చెందిన 311 మిలియన్ డాలర్ల ఐదు ఖాతాలను స్విస్ పబ్లిక్ ప్రాసక్యూటర్స్ ఆఫీసు స్తంభింపచేసినట్లు నేటి ఉదయం పత్రికల్లో వార్తలు వచ్చాయని,

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు. 2021 డిసెంబర్ 28న మనీ లాండరింగ్ రిపోర్టింగ్ ఆఫీస్ ఆఫ్ స్విట్జర్లాండ్ ప్రారంభించిన దర్యాప్తులో భాగంగా ఈ ఖాతాల స్తంభన జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రిసెర్చ్ గత ఏడాది అదానీ గ్రూపుపై ఇచ్చిన నివేదికతో ఆ గ్రూపు కంపెనీలకు చెందిన ఆస్తులు దాదాపు 150 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూశాయి. ఇదిలా ఉండగా తనపై వచ్చిన ఆరోపణలను అదానీ గ్రూపు ఖండించింది. స్విస్ కోర్టు విచారణతో తమకు ఎటువంటి సంబంధం లేదని అదానీ గ్రూపు స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News