Tuesday, April 15, 2025

ఢిల్లీలో అంబేద్కర్ అంత్యక్రియలను అనుమతించని కాంగ్రెస్ సర్కార్: సిఎం యోగి

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంటే కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం గౌరవం లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. మహానుభావుడు మరణిస్తే.. ఆయన అంత్యక్రియలను ఢిల్లీలో నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించలేదని ఆయన ఆరోపించారు. అలాగే రాజ్యాంగ నిర్మాతకు ఘనమైన స్మారక మందిరాన్ని కూడా ఢిల్లీలో ఏర్పాటు చేయలేదని అన్నారు. లక్నోలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమ్మాన్ సమారోహ్ ఆధ్వర్యంలో జరిగన సమావేశంలో యూపీ సీఎం ఈ ప్రకటన చేశారు.కాంగ్రెస్ పార్టీ వారు మొదట డాక్టర్ అంబేద్కర్ ను ఎన్నికల్లో ఓడించేందుకు కృషిచేశారు. బాబాసాహెబ్ మహా పరినిర్వాణం తర్వాత ఢిల్లీలో ఆయన అంత్యక్రియలను నిర్వహించడానికి అనుమతించలేదు. అలాగే ఆయన స్మారక చిహ్నం ఏర్పాటు చేయడానికి కూడా అనుమతి ఇవ్వలేదని యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News