Monday, December 23, 2024

నల్లా బిల్లుల రద్దు చేయాలంటూ కాంగ్రెస్ ధర్నా

- Advertisement -
- Advertisement -

శామీర్‌పేట: తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఉచితంగా మంచినీరు సరఫరా చేస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ప్రజల ముక్కుపిండి నల్లా బిల్లులు వసూలు చేస్తున్నారని టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బుధవారం శామీర్ పేట మండలం తూంకుంట మున్సిపాలిటీలో నల్లా బిల్లుల రద్దుకై మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

తూంకుంట మున్సిపల్ కార్యాలయం నుండి హెచ్‌ఎండబ్ల్యూఎస్ కార్యాలయం వరకు నల్లా బిల్లులు రద్దు చేయాలని ర్యాలీ నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటి ఉచితంగా మంచినీరు సరఫరా చేస్తున్నామని చెప్పి నల్లా బిల్లులు వసూలు చేయడం మంత్రి అసమర్ధతకు నిదర్శనం అన్నారు.

హైదరాబాద్ నగరంలో ఉచితంగా మంచినీరు సరఫరా చేసి,మున్సిపాలిటీలలో ఎందుకు నల్లా బిల్లులు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు.మున్సిపాలిటీలలో నివసించే ప్రజలు తెలంగాణ బిడ్డలు కాదా అన్నారు. వెంటనే మంత్రి మల్లారెడ్డి మున్సిపల్ అధికారులతో సమీక్ష జరిపి ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తున్న నల్లా బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ధర్నా కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అద్యక్షులు వేముల మహేష్ గౌడ్,టిపి సిసిమెంబర్ చంద్రశేఖర్,శామీర్ పేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ గౌడ్,ఘణపురం గ్రామ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి,తూంకుంట మున్సిపల్ కౌన్సిలర్‌లు మధుసూదన్ రెడ్డి,పూజ భరత్ సింగ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు జనార్దన్ రెడ్డి, నాగేష్ గౌడ్,మురళి గౌడ్, రాము,యాదగిరి, శ్రీనివాస్ యాదవ్, మురళి గౌడ్, ధర్మారెడ్డి, కొండల్ రెడ్డి, దర్శన్ గౌడ్, జగన్,రవీందర్ గౌడ్, రామ్ చందర్ యాదవ్, మల్లేష్ యాదవ్, మధుసూదన్ రెడ్డి, గోవర్ధన్ గౌడ్, బద్రి, రవీందర్, ఆదినారాయణ, పాండు, మల్లేష్ గౌడ్, శ్రీనివాస్, దుర్గయ్య, బాబు, బల్వంత్ రెడ్డి,బిక్షపతి, ప్రసాద్, యూత్, మహిళా నాయకురాలు నాగమణి, మంజుల, రజని, కళమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News