Wednesday, January 22, 2025

ఎన్నికల సన్నద్ధతపై గుజరాత్ నేతలతో ఖర్గే భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ సన్నద్ధతకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనాయకత్వం శనివారం నాడిక్కడ సమావేశమై చర్చలు జరిపింది. పార్టీని బలోపేతం చేసేందుకు తాము సానుకూల అజెండాతో ముందుకు వెళతామని కాంగ్రెస్ అద్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. ఇక్కడి ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో గుజరాత్ కాంగ్రెస్ నాయకులతో ఖర్గే అధ్యక్షతన సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. గుజరాత్‌లో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సవాళ్లను, బిజెపి దుష్పరిపాలనను ప్రజలకు వివరించడానికి తీసుకోవలసిన చర్యలను ఈ సమావేశంలో చర్చించారు. అన్ని రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేయడతోపాటు వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీని సన్నద్ధం చేయడం కోసం కాంగ్రెస్ అగ్రనాయకత్వం నిర్వహిస్తున్న సమావేశాల పరంపరలో భాగంగాశనివారం గుజరాత్ కాంగ్రెస్ నాయకులతో ఈ సమావేశం జరిగింది.

గుజరాత్‌లో బిజెపి ప్రభుత్వ నిరాటంక దుష్పరిపాలన కారనంగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానతలు, దళితులు, గిరిజనుల అత్యాచారాలు, అవినీతి, మోసాలు కొనసాగున్నాయని సమావేశం అనతరం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఖర్గే ట్వీట్ చేశారు. ఈ సమావేశంలో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్, గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శక్తిసింహ్ గోహిల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News