Monday, November 18, 2024

గోవాలో మూడు పార్టీలతో కాంగ్రెస్ పొత్తు చర్చలు

- Advertisement -
- Advertisement -
gundu rao
gundu rao

పానాజీ: వచ్చే ఏడాది గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సోమవారం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి), గోవా ఫార్వర్డ్ పార్టీ(జిఎఫ్‌పి), మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ(ఎంజిపి)తో పొత్తు పెట్టుకునే విషయమై చర్చించింది. గోవాలో మతవాద, అవినీతి బిజెపి ప్రభుత్వాన్ని వదిలించుకోడానికి ఎఐసిసి గోవా డెస్క్ ఇన్‌ఛార్జి దినేశ్ గుండు రావు ఈ పార్టీలతో చర్చిస్తున్నట్తు విలేకరులకు తెలిపారు. ఒకవేళ ఈ కూటమి ఏరాటు కనుక కార్యరూపం దాలిస్తే గోవాలో ఐదేళ్లపాటు ఉండే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ఆశాభావంతో కాంగ్రెస్ ఉంది. గోవా అసెంబ్లీ ఎన్నికలు 2022 ఫిబ్రవరిలో జరుగనున్నాయి. గతంలో జిఎఫ్‌పి, ఎంజిపిలు బిజెపి ప్రభుత్వంలో భాగంగా ఉండేవి.
గోవాలో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 40 సీట్లలో 17 కాంగ్రెస్, 13 బిజెపి గెలుచుకున్నాయి. కాగా బిజెపి ప్రాంతీయ పార్టీల మద్దతుతో సర్గీయ మనోహర్ పారికర్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. గత ఐదేళ్లలో కాంగ్రెస్ 13 మంది ఎంఎల్‌ఏలను ప్రతిపక్షం తరఫున కోల్పోయింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంఎల్‌ఏ లూజిన్హో ఫెలీరో ఇటీవల టిఎంసి పార్టీలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News