న్యూఢిల్లీ: భారత దేశం చైనాతో శతృత్వం పెట్టుకోవద్దని అలా చేస్తే.. వచ్చే ముప్పును ఎవరి ఊహకి కూడా అందదు అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలు శామ్ వ్యక్తిగతమని.. వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.
తొలి నుంచి చైనాతో భారత్ అనుసరిస్తున్న వైఖరి ఇరు దేశాల మధ్య శతృత్వం పెంచుతుందని శామ్ పిట్రోడా అన్నారు. చైనాను భారత్ శతృవుగా చూస్తే.. ఆ దేశం నుంచి వచ్చే ముప్పుని ఎదురుకోలేము అని పేర్కొన్నారు. చైనాను గుర్తించడంతో పాటు గౌరవించంచాల్సిన పరిస్థితి ఉందని.. ఇకనైన భారత్ తన పద్ధతిని మార్చుకోవాలని ఆయన పేర్కొన్నారు.
దీంతో దేశావ్యాప్తంగా బిజెపి నేతలు శామ్‌పై మండివడుతున్నారు. ఈ నేపథ్యంలో శామ్ పిట్రోడా వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ వివరణ ఇచ్చారు. ‘చైనాపై శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలకు మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు’ అంటూ ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.