- Advertisement -
న్యూఢిల్లీ: తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ శైవమఠం నుంచి అప్పట్లో ఈ చారిత్రక రాజదండం నెహ్రూకు అందిందని, తరువాత ఇది మాయమయి చివరికి అలహాబాద్ మ్యూ జియంలో ఓ ఊతకర్ర స్థితిలో ఉందని, దేశానికి ఇది అవమానకరం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి ఇతర నేతలు విమర్శించారు. భారతీయ సంస్కృతి ఆచార వ్యవహారాలంటే పడని కాంగ్రెస్ అనుచితంగా వ్యవహరిస్తోందని అమిత్ షా చెప్పారు.
ప్రతిపక్ష పార్టీలు కొన్ని పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించడంపై బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా ఖండించారు. వారసత్వ రాజకీయాల కాంగ్రెస్‌పార్టీకి రాజ్యాంగయుత ప్రజాస్వా మ్యం, గణతంత్రం అంటే సహించదని విమర్శించారు. కాంగ్రెస్ నేతలలో సహేతుకత లోపించిందని, వంశానుగత రాజకీయాల ప్రస్తావన లేకుండా అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి పట్ల దేశ ప్రజలు తమ నమ్మకం చాటిచెప్పడం ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోందన్నారు.
- Advertisement -