Monday, December 23, 2024

కాంగ్రెస్ కటిక చీకట్ల కాలం వద్దు

- Advertisement -
- Advertisement -

ధర్మారం: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఇచ్చే 24 గంటల ఉచిత విద్యుత్ కరెంటు కావాలా, కాంగ్రెస్ తెచ్చే కటిక చీకట్ల కాలం కావాలా అంటూ జడ్పీటీసీ పద్మజ జితేందర్ రావు రైతులను ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సోమవారం మండలంలోని కటికెనపల్లి గ్రామ రైతు వేదికలో బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి రైతులకు అందుతున్న కరెంటుపై చర్చించారు.

ఈ సందర్భంగా పలువురు రైతులు ముక్తకంఠంతో కేసీఆర్ ఇచ్చే 24 గంటల కరెంటు కావాలంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ పాలన ముద్దు, మూడు గంటల వ్యవహారం వద్దు, మూడు పంటల విధానం కావాలని అంటూ రైతులంతా తీర్మాణం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పూసుకూరి పద్మజ జితేందర్ రావు, మేడారం సింగిల్ విండో చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, పత్తిపాక సింగిల్ విండో చైర్మన్ నోముల వెంకట్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, రైతు బంధు జిల్లా సభ్యులు పుసుకూరి రామారావు, ఎగ్గేల స్వామి,

బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చొప్పరి చంద్రయ్య, ఎంపీటీసీల ఫోరం మండల అద్యక్షుడు మిట్ట తిరుపతి, సర్పంచ్ కారుపాకల రాజయ్య, క్లస్టర్ పరిధిలోని సర్పంచ్‌లు దాసరి తిరుపతి, దార మల్లమ్మ, తాళ్ల మల్లేశం, కల్లెం గంగారెడ్డి, మట్టె లక్ష్మీ, శంకర్, బద్దం సుజాత, ఎంపీటీసీ సూరమళ్ల శ్రీనివాస్, బానోత్ సరిత రాజు నాయక్, పార్టీ మండల అధికార ప్రతినిధి గుర్రం మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కూరపాటి శ్రీనివాస్, అనుబంధ శాఖ అధ్యక్షుడు మంద శ్రీనివాస్, గుజ్జేటి కనకలక్ష్మీ, దేవి నలినికాంత్, ఉపసర్పంచ్ ఆవుల లత, నాయకులు గూడూరి లక్ష్మణ్, మనుపాటి సాయిలు, మల్లేశం, భువనగిరి శ్రీనివాస్, రాజేందర్ రెడ్డి, దేవి రాజేందర్, సల్వాజి మాధవరావు, ఎండి అజాం, బొల్లి శేశిధర్, కాంపెల్లి చందు, మహిళ నాయకులు దేవి లావణ్య, దేవి రేణుక, కాంపెల్లి అపర్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News