Thursday, February 13, 2025

బిసిలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోంది: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మతపరమైన రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకమని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. బిసి జాబితాలో ముస్లింలను చేరిస్తే ఆమోదించే ప్రసక్తే లేదని అన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రంపై నెట్టాలనుకోవడం మూర్ఖత్వమని విమర్శించారు. బిసి రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ కు లేదనేది తేట తెల్లమైందన్నారు. బిసిల్లో ముస్లింలను చేర్చడం వల్ల బిసిలకు రిజర్వేషన్లు తగ్గుతాయని చెప్పారు. బిసిలకు కాంగ్రెస్ మరింత అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే బిసి జాబితా నుంచి ముస్లింలను తొలగించాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు  బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం కాంగ్రెస్ కు లేదని దుయ్యబట్టారు. ఎన్నికలు నిర్వహించకపోతే ఆర్థిక సంఘం నిధులు రావని, నిధులు రావని తెలిసినా… స్థానిక సంస్థల ఎన్నికలను ఎందుకు జాప్యం చేస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News