Tuesday, December 24, 2024

కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

- Advertisement -
- Advertisement -

ఖానాపురం: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాయని మండల యువజన కాంగ్రెస్ నాయకులు అన్నారు. బుధవారం ఖానాపురం మండలంలోని బుధరావుపేట గ్రామంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వేముల ఇంధ్రదేవ్ ఆదేశాల మేరకు గడప గడపకు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెంటనే రూ. 500లకు వంట గ్యాస్, మహిళలకు ఉచిత బస్ పాస్, ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టుకోడానికి రూ. 5 లక్షలు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అందచేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ మోడెం ఎల్లగౌడ్, ప్రశాంత్, మహేష్, వినోద్, మురారి, శంకర్, నజీర్, రాజు, కుమార్, శివచారి, వేణుగోపాల్, వినయ్, వెంకటేశ్, నవీన్, వంశీ, మహేష్, అశోక్, కార్తీక్, అర్షద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News