Sunday, January 19, 2025

కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు ఢిల్లీలో అనుసరిస్తున్న వైఖరే నిదర్శనం

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు ఢిల్లీలో ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరే నిదర్శనం అని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరిపోయాక మరోలా వ్యవహరించడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని ఎక్స్ వేదికగా విమర్శించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ పట్ల ప్రదర్శిస్తున్న వైఖరికి, పార్లమెంటు ఎన్నికల సమయంలో ఇండియా కూటమిలో ఉన్న అదే కేజ్రీవాల్ పట్ల కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని పరిశీలిస్తే అది తెలుస్తుందని అన్నారు.

ఇండియా కూటమిలో ఉన్నంతవరకు వివేకవంతుడు, నీతిమంతుడిగా కనిపించిన కేజ్రీవాల్ కూటమి నుంచి బయటకు రాగానే ఆప్ అవినీతి పార్టీకి వారికి కనిపిస్తుందని విమర్శించారు. రాజకీయాల్లో ద్వంద్వ ప్రమాణాలు పాటించే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక పాఠ్యపుస్తకమని కెటిఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చిన హామీల అమలు కోసం ఏడాది కాలంగా తెలంగాణలోని విద్యార్థులు, రైతులు, వృద్ధులు, మహిళలు ఏడాదికాలంగా నిరీక్షిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ అవే తరహాలో హామీలను ప్రజలకు ఇస్తుందని మండిపడ్డారు. ఢిల్లీ ఓటర్లను మోసం చేయడానికి ముందు తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడి, వారి అనుభవాలను తెలుసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News