Wednesday, January 22, 2025

కాంగ్రెస్…పాంచజన్యం

- Advertisement -
- Advertisement -

పాంచ్ న్యాయ్‌తో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల 25 గ్యారంటీలతో
అన్ని వర్గాలకు న్యాయం మహిళలు, రైతులు, యువత, కార్మికులు,
పేదల సంక్షేమంపైనే ఫోకస్ దేశవ్యాప్తంగా కులగణన 30
లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్
తొలగింపు మహిళలకు ఏటా రూ. 1 లక్ష నగదు బదిలీ
ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్
రైతుల పంటకు ఎంఎస్‌పి చట్టబద్ధత పేదలకు రూ. 25 లక్షల
వరకు ఉచితంగా వైద్యం అగ్నిపథ్ పథకం రద్దు..పాత విధానం
పునరుద్ధరణ ఉపాధి హామీ కూలీ రూ. 400కు పెంపు జిఎస్‌టి
చట్టాల స్థానంలో కొత్త విధానం అన్ని వర్గాలపై హామీల వర్షం

న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఐదు న్యాయ స్తంభాలపై ప్రధానంగా దృష్టిని సారిస్తూ పాంచ్ న్యాయ్(ఐదు న్యాయాలు) పేరిట కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. యువ(యువత), కిసాన్(రైతులు), నారీ(మహిళలు), శ్రామిక్(కార్మికులు), హిస్దేరీ(సమానత్వం) పేరిట పాంచ్ న్యాయ్‌ను కాంగ్రెస్ ప్రకటించింది. వీటి కింద మొత్తం 25 గ్యారెంటీలను కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చేర్చింది. ఉపాధి, సంపద, సంక్షేమం వంటి మూడు ప్రధాన అంశాలను ఆధారం చేసుకుని మేనిఫెస్టోను రూపకల్పన చేసినట్లు కాగ్రెస్ పార్టీ అద్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం నాడిక్కడ ప్రకటించారు. ఉపాధి అంటే ఉద్యోగాల కల్పన..సంపద అంటే ప్రజలకు పంచడానికి ముందు సంపదను సృష్టించడం..సంక్షేమం అంటే పేద బడుగు వర్గాల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడమని ఆయన తెలిపారు. ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన న్యాయ పత్ర(మేనిఫెసో)్ట విడుదల కార్యక్రమంలో ఖర్గేతోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మేనిఫెస్టో రూపకల్పన కమిటీ చైర్మన్ పి చిదంబరం తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కులగణన, మహిళలకు నగదు బదిలీ, యువతకు ఉపాధి అవకాశాలు, రైతులకు వారి పంటలకు కనీస మద్దతు ధర, బడుగు బలహీన వర్గాలకు ఉచిత వైద్యం, ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసిల కోసం
రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం గరిష్ఠ
పరిమితిని తొలగించడం, ట్నిపథ్ పథకం తొలగించి సైన్యంలో పాత నియామక విధానాన్ని పునరుద్ధరిండం వంటి హామీలపై కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి
సారించింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో
పొందుపరిచిన ప్రధాన అంశాలు

దేశవ్యాప్తంగా ప్రతి కార్మికుడికి రోజుకు రూ. 400 చొప్పున వేతనం లభించేలా హామీ. ప్రభుత్వ ఆస్తుల నిర్మాణంలో ఉపాధి హామీ కార్మికులకు ఉపాధి లక్పించడం, పారిశ్రామిక, కార్మిక చట్టాలలో సంస్కరణలు తీసుకురావడం. డొమెనస్టిక్ హెల్ప్, వలస కార్మికుల ఉపాధిని క్రమబద్ధం చేసేందుకు చట్టాలు చేసి వారికి మౌలిక న్యాయపరమైన హక్కులను పరిరక్షించడం. అన్ని రాష్ట్రాలలో వలస కార్మకులతో సహా రేషన్ కార్డు హోల్డర్ల జాబితాలను సరిదిద్ది వారికి రేషన్ సక్రమంగా అందేలా చూడడం. పిడిఎస్ విస్తృతిని పెంచి బియ్యం, గోధుమలతోపాటు పప్పులు, వంట నూనె లభించేలా చూడడం. కర్నాటక, రాజస్థాన్ తరహాలో సబ్సిడీ ధరలకు భోజనం పెట్టేందుకు ఇందిరా క్యాంటీన్ల ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించడం.

ప్రభుత్వ ఆసుపత్రులు, క్లినిక్‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సంచార ఆరోగ్య యూనిట్లు, డిస్పెన్సరీలు, వైద్య శిబిరాలలో ఉచిత ఆరోగ్య రక్షణ. ఇందులో వైద్య పరీక్షలు, డయాగ్నసిస్, చికిత్స, సర్జరీ, మందులు, పునరావాసం వంటివి కూడా ఉచితంగా జరరుగుతాయి. రూ. 25 లక్షల వరకు నగదురహిత బీమాను కల్పించే రాజస్థాన్ మోడల్ యూనివర్సల్ హెల్త్‌కేర్ దేశవ్యాప్తంగా ఏర్పాటు. ఆరోగ్య బీమా పథకాలలో ప్రైవేట్ ఆసుపత్రులు, లాభాపేక్షలేని ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలను భాగస్వాములను చేయడం. మహిళలందరికీ ప్రసూతి ప్రయోజనాలు కల్పించడం. ఏటా ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపు పెంచడం. ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలతో కూడిన సుపత్రి ఏర్పాటు.

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ స్థాయిలలో శాంక్షన్ అయిన పోస్టులలో దాదాపు 30 లక్షల ఖాళీల భర్తీ. సైన్యంలో అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేసి సాత నియామక విధానాన్ని పునరుద్ధరించడం. 25 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి డిప్లొమా హోల్డర్ లేదా కాలేజ్ గ్రాడ్యుయేట్‌కు ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగ కంపెనీలో ఏడాది అప్రెంటిస్‌షిప్ కల్పించేందుకు అప్రెంటిస్‌షిప్ హక్కు చట్టాన్ని చేయడం. ఏడాదికి రూ. 1 లక్ష చొప్పున అప్రెంటిస్‌లకు స్టైపెండ్ చెల్లింపు. 2024 మార్చి 25 నాటికి చెల్లించని వడ్డీతోసహా మొత్తం విద్యార్థి విద్యా రుణ బకాయి మాఫీ. అదనంగా 14 లక్షల ఉద్యోగాలు సృష్టించి అంగన్వాడీ కార్మికుల సంఖ్యను రెట్టింపు చేయడం. 2,500 జనాభా దాటిన ప్రతి గ్రామంలో రెండవ ఆషా వర్కర్ల నియామకం. పట్టణ పేదల కోసం ఉపాధి హామీ కార్యక్రమం. తక్కువ చదువుకున్న యువతకు ఉపాధి కల్పన.ఎస్‌సి, ఎస్‌టిలకు చెందిన విద్యార్థుల కోసం ఆశ్రమ పాఠశాలల వ్యవస్థ ఏర్పాటు, విదేశీ విద్య కోసం మౌలానా ఆజాద్ స్కాలర్‌షిప పునరుద్ధరణ, మైనారిటీల ప్రాథమిక హక్కులకు గౌరవం..దుస్తులు, ఆహారం, భాష, వ్యక్తిగత చట్టాలలో పూర్తి స్వేచ్ఛ.
సమ న్యాయం
దేశవ్యాప్తంగా సామాజిక-ఆర్థిక కుల గణన నిర్వహించి వివిధ కులాలు, ఉప కులాల సామాజిక, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా రిజర్వేషన్లను సమీక్షించడం. ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఓబిసిల రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం గరిష్ఠ పరిమితిని తొలగించేందుకు రాజ్యాంగ సవరణ చేయడం. ఆర్థికంగా బలహీన వర్గాలకు(ఇడబ్లుఎస్) ఉద్యోగాలు, విద్యా సంస్థలలో 10 శాతం రిజర్వేషన్లను అన్ని కులాలు, వర్గాలకు ఎటువంటి వివక్ష లేకుండా అమలు చేయడం. ఏడాదిలోగా ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఓబిసిల కోసం రిజర్వ్ చేసిన బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయడం, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో రెగ్యులర్ జాబ్‌లను కాంట్రాక్టు పద్ధతితి నియామకాలు జరపడాన్ని రద్దు చేయడం, కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణ. ప్రభుత్వ భూములు, మిగులు భూములను పేదలకు పంపిణీ చేయడంపై పర్యవేక్షణకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం, ఉన్నత విద్యలో ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఓబిసిల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల కోసం నిధులను రెట్టింపు చేయడం వంటివి మేనిఫెస్టోలో ఉన్నాయి.

స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేరకు ప్రతి ఏటా ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి)కు చట్టబద్ధత కల్పించడం. ప్రతి పెద్ద గ్రామం, చిన్న పట్టణాలలో రైలుత రిటైల్ మార్కెట్ల ఏర్పాటు. ఐదేళ్లలో పాడి రైతులు, పౌల్ట్రీ రైతుల ఆదాయం రెట్టింపు చేయడం. వ్యవసాయంలో పరిశోధన, అభివృద్ధి కోసం ఐదేళ్లలో రెట్టింపు నిధులు. మతకారులకు బ్యాంకుల ద్వారా క్రెడిట్ కార్డులు(కిసాన్ క్రెడిట్ కార్డుల తరహాలో) అందజేత. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్సకారులకు సబ్సిడీ ధరలకు డీజిల్ సరఫరా. దేశీయ జలాలలో సాగించే చేపల వేట, అక్వాకల్చర్‌ను వ్యవసాయంగా గుర్తింపు. కుల గణనలో మత్సకార వర్గాలను కూడా లెక్కించి వారికి కేంద్రం నుంచి గుర్తింపు కార్డుల అందజేత.

ప్రతి పేద కుటుంబానికి ఏటా రూ. 1 లక్ష చొప్పున ఎటువంటి షరుతులు తేకుండా నగదు బదిలీ. వారి ఆదాయం ప్రతిపాదికన లబ్ధిదారుల ఎంపిక. కుటుంబంలోని అత్యధిక వయస్కురాలైన మహిళకు నేరుగా బ్యాంకు ఖాతాలో నగదు బదిలీ. కుటుంబంలో మహిళ లేని పక్షంలో కుటుంబంలో అతి పెద్ద వయసున్న వ్యక్తి బ్యాంకు ఖాతాలోకి నగదు బదిలీ.
2025 సుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు. న్యాయమూర్తులు, ప్రభుత్వ కార్యదర్శులు, పోలీసు అధికారులు, న్యాయ అధికారులు, లిస్టెడ్ కంపెనీల బోర్డుల డైరెక్టర్లు వంటి ఉన్నత స్థాయి పదవులలో మహిళలకు అధిక ప్రాధాన్యం.
మహిళలకు వ్యతిరేకంగా వేతనాలలో వివక్షను నివారించడానికి ఒకే పని, ఒకే వేతనం లభించేందుకు చర్యలు.
పనిప్రదేశంలో లైంగిక వేధింపులు, గృహ హింస నుంచి రక్షణ వంటి మహిళా సంబంధ నేరాల నిరోధానికి కఠిన చర్యలు.
మహిళా వలస కార్మికులకు రాత్రిపూట ఆశ్రయం కోసం భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర నిధులు. పట్టణాలు, నగరాలలో మహిళల కోసం సురక్షిత, పరిశుభ్రమైన సమృద్ధిగా టాయిలెట్ల నిర్మాణం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News