Sunday, December 22, 2024

కాంగ్రెస్ కసరత్తు

- Advertisement -
- Advertisement -

మూడు లోక్‌సభ నియోజకవర్గాల నేతలతో ఎఐసిసి నాయకుల భేటీ
అహర్నిశలు కష్టపడి సత్ఫలితాలు రాబట్టాలని ఇన్‌చార్జి మున్షీ సూచన

మనతెలంగాణ/హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తు చేపట్టింది. అందు లో భాగంగా మంగళవారం గాంధీభవన్‌లో మూడు పార్లమెంట్ నియోజకవర్గాల మైనార్టీ నాయకులతో ఏఐసిసి ఇన్‌ఛార్జి దీప్‌దాస్ మున్షీ, ఏఐసిసి కార్యదర్శి మన్సూర్ అలీ ఖాన్, రో హన్ చౌదరిలు సమావేశమయ్యారు. సికింద్రాబాద్, చేవెళ్ల, హైదారాబాద్ పార్లమెంట్ నియోజక వర్గాల మైనార్టీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు, సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజక వర్గాల్లో పట్టు కోసం కాంగ్రెస్ వరుస సమీక్షలు నిర్వహిస్తుండగా ప్రస్తుతం మంగళవారం ఈ మూడునియోజకవర్గాల నాయకులతో ఏఐసిసి నాయకులు సమావేశమయ్యారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్, హైదారాబాద్ పార్లమెంట్ పరిధిలో సరైన ఫలితాలు రాకపోవడంతో ఈ నియోజక వర్గాలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి మంచి ఫలితాలు సాధించాలని దీప్‌దాస్ మున్షీ ఆయా నియోజకవర్గాల నాయకులకు సూచించారు. మూడు పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలో బలాలు, బలహీనతలు అంచనా వేసుకొని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించే విధంగా నాయకులు కృషి చేయాలని ఆమె సూచించారు. బిఆర్‌ఎస్, బిజెపి ఎత్తుగడలు తిప్పి కొట్టి ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేలా నాయకులు కృషి చేయాలని ఆమె పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News