Saturday, January 18, 2025

కర్ణాటకలో 15 నుంచి 20 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ విజయం

- Advertisement -
- Advertisement -

చిత్రదుర్గ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో 15 నుంచి 20 స్థానాల్లో విజయం సాధించగలమని కాంగ్రెస్ అంచనా వేస్తున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదివారం వెల్లడించారు. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలున్నాయి. రాష్ట్రం లోని మొత్తం 28 స్థానాలు గెలుస్తామని బీజేపీ మాదిరి తాము అబద్ధాలు చెప్పబోమని, 15 నుంచి 20 స్థానాల్లో కాంగ్రెస్ విజయం ఉంటుందని తాము అంచనాగా భావిస్తున్నట్టు విలేఖరులకు తెలిపారు. కొన్ని సర్వేల వల్ల తమకు ఈ అంచనా తెలిసిందన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 25 స్థానాలు గెల్చుకుంది. బీజేపీ మద్దతుతో ఇండిపెండెంట్ ఒకరు ( మాండ్య నుంచి సుమలతా అంబరీష్ ) గెలుపొందారు. కాంగ్రెస్, జెడి (ఎస్) చెరో ఒక సీటు దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్, జెడి(ఎస్) పొత్తు కుదుర్చుకున్నాయి. అయితే ఈసారి ప్రాంతీయ పార్టీ బీజేపీతో భాగస్వామ్యమౌతోంది. “ ఇదివరకు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాజికఆర్థిక విద్యా నివేదిక, కులగణన గా ప్రాచుర్యం పొందిన ఆ నివేదిక సిద్ధం కాలేదు. ” అని సిద్దరామయ్య ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.

“హెచ్‌డి కుమారస్వామి ముఖ్యమంత్రిగా అధికారం లోకి వచ్చిన సంకీర్ణ ప్రభుత్వం ఈ నివేదికను అంగీకరించలేదు. తరువాత అధికారం లోకి వచ్చిన బీజేపీ కూడా ఆంగీకరించలేదు. ఇప్పుడు ఆ నివేదికను సమర్పిస్తే తాము స్వీకరిస్తాం” అని వివరించారు. ఆ నివేదిక వచ్చిన తరువాత చర్చకు ప్రజల్లోకి తెస్తారా అన్న ప్రశ్నకు ఇంకా ఆ నివేదిక సమర్పించవలసి ఉందని సిద్దరామయ్య చెప్పారు. అందులో ఏముందో ఎవరికీ తెలియదు. అది వచ్చాక తాము చర్చిస్తామని తెలిపారు. 20132018లో సిద్దరామయ్య నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం 2015లో రూ.170 కోట్ల వ్యయంతో సామాజికఆర్థిక , విద్యా సర్వేను చేపట్టింది. అయితే ఆ నివేదిక అంశాలు ఏవీ వెల్లడి కాలేదు. 2018 నాటికి సర్వే పని పూర్తయింది. అప్పటికి సిద్దరామయ్య ప్రభుత్వం మొదటి పాలనా కాలం ముగిసింది. కానీ ఆ నివేదిక అంగీకారం కాలేదు సరికదా బహిర్గతం కాలేదు. ప్రస్తుతం కర్ణాటక వెనుకబడిన తరగతుల కమిషన్ ఈ కులగణన సర్వేను చేపట్టింది. ఈ నివేదిక సమర్పించడానికి ఈ నెల 31 వరకు గడువు ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News