Tuesday, January 21, 2025

తెలంగాణలో 99శాతం హామీలు అమలు కాలేదు: కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఆరు గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 99 శాతం హామీలను అమలే చేయలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పచ్చి అబద్ధాలతో నడిపిస్తోందని కన్నెర్ర చేశారు. ముంబయిలో మంగళవారం జరిగిన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వచ్చి అబద్ధాలను ఇక్కడి ప్రజలకు చెప్పారని, అయితే తెలంగాణ ప్రజలను ఎలా మోసం చేశారో వివరించేందుకు తాను మహారాష్ట్ర ప్రజల ముందుకు వచ్చానన్నారు. రైతులు, మహిళలు, యువత, కార్మికులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ జోడీ తెలంగాణ ప్రజలను ఎలా మోసం చేశారో, అదే తరహాలో మహారాష్ట్ర ప్రజలను కూడా మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారాయని, ఆర్‌ఆర్ ట్యాక్స్ పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నాయని, తెలంగాణలో పూర్తిగా అధికార దుర్వినియోగం జరుగుతోందని ధ్వజమెత్తారు.

ప్రచారం కొండంత..చేసింది గోరంత
అంతే కాకుండా రాహుల్, సోనియా, ప్రియాంక, రేవంత్ రెడ్డి ఊరూరా తిరిగి ఆరు గ్యారంటీల పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేశారని కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రచారం భారీగా చే సి హామీలు అమలు చేసింది మాత్రం గోరంత అని అన్నా రు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రె డ్డి చెప్పారని, రైతులెవరూ అప్పులు కట్టొద్దని వారిని రెచ్చగొట్టారని అన్నారు. అయితే ఆ హామీని అందరికి అమలు చేయకుండా లక్షలాది మంది రైతులకు మొండి చెయ్యి చూ పించారన్నారు. మేనిఫెస్టోలో మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని తెచ్చి నెలకు రూ.2,500 ఇస్తామన్న హామీ ఇప్పటివరకు ఏ ఒక్క మహిళకు కూడా ఈ పథకం లబ్ధి అందలేదని విమర్శించారు.

రైతులకు రైతు భరోసా పేరుతో రూ. 15వేల ఆర్థిక సహాయం ఇస్తామని, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు కూడా రైతు భరోసా ఇస్తామనే హామీని కూడా అమలు చేయలేదని, ఆర్థిక సాయం కూడా ఏ ఒక్కరికీ చేరలేదని కిషన్‌రెడ్డి తెలిపారు. వివిధ పంటలకు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశారని అన్నారు. బోనస్ ఇవ్వకపోగా కేంద్రప్రభు త్వం ఇస్తున్న కనీస మద్దతు ధరను కూడా ఇవ్వకుండా ద ళారులతో లూటీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు లేవు, కానీ హైదరాబాద్‌లో మాత్రం మూసీ సుందరీకరణ పేరుతో దశాబ్దాలుగా ఉన్నవారిని ఇండ్ల ఇళ్లు కూల్చేస్తున్నారని తెలిపారు. మేనిఫెస్టోలో మొ దటి పేజీలోని పథకాలే అమలు చేయలేని రేవంత్ రెడ్డి, కాం గ్రెస్ నాయకులు మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు రావడం విడ్డూరం, హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News