Sunday, December 22, 2024

కర్నాటకను ముంచిన కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నమ్మి మోసపోవద్దని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి రైతులకు కరెండు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఆయన నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన 5 గ్యారెంటీలు విస్మరించందని, ఆపార్టీ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని తెలిపారు.

కర్ణాటక ప్రజలను మోసం చేసిన సిద్ధరామయ్య సర్కారు దివాలా దిశగా నడుస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీలనీ అబద్దపు హామీలతో కర్ణాటక ప్రజలను మోసం చేసిందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలోనూ ఆరు గ్యారెంటీ పథకాల పేరిట ఆ పార్టీ సరికొత్త నాటకానికి తెరలేపిందని విమర్శించారు. వాటిని నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోవద్దని కోరారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News