Thursday, December 19, 2024

సుంకిశాల ప్రాజెక్టుపై కాంగ్రెస్ అసత్య ప్రచారం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సుంకిశాల ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ నీటి అవసరాల కోసం సుంకిశాల ప్రాజెక్టు పనులు మొదలు పెట్టారని, సుంకిశాల ప్రాజెక్టుకు పునరుజ్జీవనం తెచ్చింది బిఆర్‌ఎస్ ప్రభుత్వం అని తెలియజేశారు. శుక్రవారం తెలంగాణ భవన్ నుంచి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. నాగార్జున సాగర్‌లో డెడ్ స్టోరేజీకి నీళ్లు చేరుకున్న హైదరాబాద్‌కు నీటి కష్టాలు రాకూడదనే ఈ ప్రాజెక్టును చేపట్టామన్నారు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు సాగు, తాగునీటి కోసం ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. కృష్ణా నదికి నాలుగేళ్లు నీరు రాకపోయినా సుంకిశాల ప్రాజెక్టుతో నీటి ఇబ్బందులు రావన్నారు. ఇవాళ బెంగళూరు, ఢిల్లీ, చెన్నైలో నీటి ట్యాంకర్ల కోసం ప్రజలు పోరాటం చేస్తున్నారని, కానీ హైదరాబాద్‌లో నీటి కోసం ఇబ్బందులు పడే పరిస్థితి లేదని కెటిఆర్ చెప్పారు.  50 ఏళ్ల వరకు హైదరాబాద్‌కు తాగునీటి అవసరాలకు సరిపడేలా ప్రణాళికలు తయారు చేశామని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News