Wednesday, January 22, 2025

భూ నిర్వాసితులకు అండగా కాంగ్రెస్ పోరాటం

- Advertisement -
- Advertisement -

 వర్గల్ : పచ్చని పేదల భూములు కార్పొరేట్లకు కట్టబెట్టి ప్రభుత్వం సొమ్ము చేసుకుంటున్నట్లు ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు. 2013 చట్టం వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపిటిసి యాదయ్య ఆధ్వర్యంలో ఆందోళన చేస్తు న్న అవుసులోనిపల్లి, రామక్కపేట,నగరం,తండా నిర్వాసితులకు మద్దుతుగా శుక్రవారం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కిసాన్‌సెల్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, పిసిసి కార్యదర్శి ప్రమోద్ కుమార్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి మద్దతు పలికారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూపిఏ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు ప్రభుత్వ భూములు పంచుతూ నేడు పచ్చని పంటలు పండే భూములను ప్రభుత్వం లాక్కుని వారిని నిరాశ్రయులను చేయడం చట్ట విరుద్దమన్నారు. దివంగత వైఎస్‌ఆర్ హయాంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 24 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు పంచగా ప్రస్తుతం వాటిపై సిఎం కెసిఆర్ కన్ను పడిందని ఎద్దేవా చేశారు. సిఎం కెసిఆర్ అమరుల ఆకాంక్షలకు భిన్నంగా పేదలను మరింత నీరపేదలుగా చేసి నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నట్లు తెలిపారు .

వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటు పేరిట వర్గల్ ప్రాంతంలో సుమారు 1500 ఎకరాలు సేకరించి తన అనుచరులకు కట్ట బెడుతున్నట్లు విమర్శించారు. ఫాంహౌజ్‌ల పేరిట సిఎం కెసిఆర్ కుటుంబం వేల ఎకరాలు కొనుగోలు చేయగా పేద ప్రజలకు మాత్రం 10 లక్షల లోపు ఇస్తూ ఆ కుటుంబాలను ఆరిగోస పెడుతున్నట్లు తెలిపారు. రెవెన్యూ, పోలీస్ అధికారుల అండతో చట్ట విరుద్ధ్దంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి పోట్టగొడుతున్నట్లు తెలిపారు. భూమిలేని పేదలకు మూడు ఎకరాల భూ పంపిణీ చేపడతామని హామీ ఇచ్చిన కెసిఆర్ ఉన్న ఫలంగా పేదల భూములు లాక్కుంటున్నట్లు తెలిపారు.

అభివృద్ధ్ది పేరిట రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పుల పాలు చేయగా వారి కుటుంబాలు మాత్రం లక్షల కోట్లు సంపాందిచినట్లు తెలిపారు. కార్యక్రమంలో పిసిసి మాజీ జడ్పిటిసి నాయిని యాదగిరి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సందీప్‌రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, మాజీ ఎంపీపీ మోహన్, మండలాల బాధ్యులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్ గుప్తా, బాస్కర్ రెడ్డి, రవీందర్‌రెడ్డి, నేతలు సదానందరెడ్డి, వెంకటేశ్, సుల్తాన్, ప్రవీణ్ గౌడ్, రామచంద్రగౌడ్, బాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి , కిషన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News