మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్‌రెడ్డి నివాసంలో శుక్రవారం రాత్రి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం అయ్యింది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్‌చౌదరితో పాటు మరో ఇద్దరు సభ్యులు సైతం ఇందులో పా ల్గొన్నారు. వారితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీ, డి ప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమా ర్ రెడ్డిలు ఉన్నారు. ముఖ్యంగా పార్లమెం ట్ సీట్లకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలిసింది. 17 నియోజకవర్గాలకు సుమారుగా 300 లకు పైచిలుకు దరఖాస్తులు రావడంతో వా టిని టిపిసిసి ఇప్పటికే వడబోత చేపట్టింది. అందులో భాగంగానే మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డిని సిఎం రేవంత్ అభ్యర్థిగా ప్రకటించగా మిగతా 16 మంది అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఉత్కంఠగా మారింది.
ఈ 16 సీట్లకు భారీగా ఆశావహులు పైరవీలు చేస్తుండడంతో ఇది అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలోనే మిగిలిన 16 సీట్లకు అభ్యర్థుల ఎంపికలో సునీల్ కనుగోలు సర్వేతో పాటు ఆయా నియోజకవర్గాల్లో ఆశావహుల బలాబలాల గురించి ఈ సమావేశంలో చర్చించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్‌చౌదరి బలహీనంగా ఉన్న పలు నియోజకవర్గాల గురించి ఆరా తీసినట్టుగా తెలిసింది. ఆయా నియోజకవర్గాల్లో కొత్త వారిని పార్టీలో చేర్చుకొని వారికి సీటును కేటాయిస్తే ఎలా ఉంటుంది, పాత వారిలో అభ్యర్థుల బలబలాలపై గురించి సిఎం రేవంత్‌ను, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీని ఆయన అడిగి తెలుసుకున్నట్టుగా సమాచారం.
త్వరగా అభ్యర్థుల ఎంపిక జరగాలని ఏఐసిసి అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలో స్క్రీనింగ్ కమిటీ ఈ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఇప్పటికే పలువురు పార్టీలో చేరిన వారితో పాటు చేరే వారి గురించి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ దృష్టికి సిఎం రేవంత్, డిప్యూటీ సిఎం భట్టిలు తీసుకెళ్లినట్టుగా తెలిసింది. అయితే కొన్ని ప్రాంతాల్లో వారికి సీట్లను కేటాయిస్తే పార్టీ కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్నట్టుగా వారు చైర్మన్‌కు సూచించినట్టుగా సమాచారం. దీంతోపాటు ఖమ్మం లేదా భువనగిరి నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేసేలా ఒప్పించాలని వారు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్‌చౌదరితో పేర్కొన్నట్టుగా తెలిసింది.