Wednesday, January 22, 2025

తమిళనాడులో కాంగ్రెస్‌కు 9 సీట్లు..డిఎంకెతో కుదిరిన ఒప్పందం

- Advertisement -
- Advertisement -

రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తమిళనాడులో పోటీ చేసే స్థానాలపై అధికార డిఎంకె, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకంపై శనివారం ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలోని 9 లోక్‌సబ స్థానాలతోపాటు పుదుచ్చేరిలోని ఒక స్థానంలో కాంగ్రెస పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ప్రకటించారు. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కుదిరిన ఒప్పందమే ఇప్పుడు పునరావృతమైంది.

తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. డిఎంకె పోటీ చేసే స్థానాలలో అభ్యర్థులను కాంగ్రెస్ బలపరుస్తుందని వేణుగోపాల్ తెలిపారు. డిఎంకె, కాంగ్రెస్ కలసికట్టుగా పోటీ చేసి కలసికట్టుగా విజయం సాధిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 40 స్థానాలలో(పుదుచ్చేరితోసహా) తమ కూటమిదే విజయమని ఆయన జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News