Friday, January 10, 2025

పార్టీని నమ్ముకున్న వారికే ప్రాధాన్యం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాలకు సమర్థ్ధులైన అభ్యర్థ్ధులను ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీ పెద్దలకు సవాల్‌గా మారింది. అభ్యర్థ్ధులను ఎంపిక చేయడం కోసం బుధవారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశం ఏకంగా మూడు గంటలపా టు సాగింది. లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జి లు, డిసిసి అధ్యక్షులు, ఇతర సీనియర్ నాయకులతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, ఎఐసిసి కార్యదర్శులు రోహిత్ చౌదరి, మన్సూర్ ఆలీఖాన్, విష్ణునాగ్‌లు సమావేశమయ్యారు. ఈ సమావేశం హాట్‌హాట్‌గా జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది గనుక ఇతర పార్టీల నుంచి ఎందరో నేతలు పార్టీలోకి వస్తున్నారని, అలా కొత్త వారికి టిక్కెట్లు ఇ స్తే పార్టీనే నమ్ముకొని అనేక సంవత్సరాలుగా ప నిచేస్తున్న వారికి అన్యాయం జరుగుతుందని, కొ త్త వారికి టిక్కెట్లు ఇస్తే తాము సహకరించేదిలేద ని ఆ నాయకులు ఎఐసిసి ప్రతినిధి బృందానికి తెగేసి చెప్పినట్లుగా తెలిసింది. ఇప్పుడు రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా బాగుందని, అందుచేతనే పార్టీకున్న పాజిటివ్ ఇమేజ్‌తోనే లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు తప్పకుండా ఘన విజయం సాధిస్తారని, అందుచేత కొత్తగా పార్టీలోకి వచ్చే వారికి టి క్కెట్లు ఇచ్చినా వారి వల్ల అదనంగా ఎలాంటి

ప్ర యోజనం ఉండదని కూడా నాయకులు అన్నట్లు తెలిసింది. కొత్త వారివల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండకపోగా పార్టీనే నమ్ముకొన్న తమలాంటి ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని, తాము కొత్త వా రితో ఇమడలేమని ఆ నాయకులు అధిష్ఠానం పె ద్దలకు తమ బాధను కూలంకషంగా వివరించిన ట్లు తెలిసింది. అందుచేతనే పార్టీ కష్టకాలంలో ఉ న్నప్పటి నుంచి ఇప్పటి వరకూ పార్టీనే నమ్ముకొ ని అంకిత భావంతో పనిచేస్తున్న వారికే లోక్‌సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దింపాలని కోరినట్లు తెలిసింది. ఇలా స్థానిక నేతలు చెప్పిన అభిప్రాయాలు, వారి తుది నిర్ణయాలను తప్పకుండా హైకమాండ్ దృష్టికి తీసుకెళతామని దీపాదాస్ మున్షీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం నేతలకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగి రి, చేవెళ్ల నియోజకవర్గాలకు చెందిన నాయకుల నుంచి మొదటగా అభిప్రాయ సేకరణ పూర్తయింది. ఇప్పటికే నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మిగిలిన

13 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. ప్రధానంగా అభ్యర్థులు ఎవరుండాలి? వారికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాదరణ నాయకుల సహకారం తదితర అంశాలపై ఒక్కొక్కరితో అభిప్రాయాలను తీసుకుంటోంది. మరోవైపు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగొలు బృందం మిగిలిన 13 నియోజకవర్గాలకు చెందిన నాయకులపై ఫ్లాష్ సర్వేలు నిర్వహించింది. ఇప్పటికే నాగర్ కర్నూల్ అభ్యర్థి ఎంపికపై మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంఎల్‌ఎలు కసిరెడ్డి నారాయణరెడ్డి, రాజేశ్‌రెడ్డి, గద్వాల జడ్పీ ఛైర్‌పర్సన్ సరిత సహా పలువురు నేతల అభిప్రాయాలను తీసుకుంది. సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కుటుంబానికి సీటు ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు భావించగా, ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అందుకు ప్రత్యామ్నాయంగా చార్టెడ్ అకౌంటెంట్ వేణుగోపాల స్వామి, విద్యా స్రవంతి పేర్లను పరిశీలించాలని స్థానిక నాయకులు అధిష్టానం పెద్దలను కోరినట్లు తెలిసింది. అదే విధంగా భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి కుమారుడు సూర్యపవన్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వరంగల్ స్థానం నుంచి దొమ్మాట సాంబయ్యను కాంగ్రెస్ ప్రతిపాదించగా, స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన ఇందిర టికెట్ కావాలని కోరుతున్నారు. అలాగే మరో నేత అద్దంకి దయాకర్‌ను అక్కడి నుంచి పోటీ చేయించాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉందని సమాచారం.

నిజామాబాద్‌లో ఎంఎల్‌సి జీవన్‌రెడ్డికి టిక్కెట్టు ఇవ్వాలని భావించగా, స్థానికంగా వ్యతిరేకత వస్తోందని సమాచారం. కాగా, మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి దాదాపు 309 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి విదితమే. ఇటీవల నలుగురు అభ్యర్థుల జాబితా విడుదల కాగా, మరో 13 మంది అభ్యర్థుల ఎంపికపై తీవ్రస్థాయి కనరత్తే కొనసాగుతోంది. అయితే సామాజిక సమీకరణాలు ఆధారం చేసుకుని అభ్యర్థుల ఎంపిక ఉంటుందని కొందరు సీనియర్ నాయకులు వివరించారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే జాతీయస్థాయిలో అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ విడుదల చేస్తోంది. ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News