Monday, December 23, 2024

ఎట్టకేలకు ఆ నాలుగు స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

పటాన్‌చెరు అభ్యర్థి సైతం మార్పు
మొత్తం ఐదుగురి పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎట్టకేలకు నాలుగు పెండింగ్ సీట్లతో పాటు పటాన్‌చెరు అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ మార్చింది. కొన్ని రోజులుగా పెండింగ్‌లో ఉన్న సూర్యాపేట, తుంగతుర్తి , మిర్యాలగూడ, చార్మినార్ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ తుది జాబితాను గురువారం రాత్రి వెల్లడించింది. దీంతోపాటు పటాన్‌చెరు అభ్యర్థి నీలం మధును మార్చడంతో ఆయన స్థానంలో దామోదరం రాజనర్సింహ అనుచరుడు కట్టా శ్రీనివాస్ గౌడ్‌ను అభ్యర్థిగా ఎంపిక చేసింది.

నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుండగా కొన్నిస్థానాల అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ ఎటూ తేల్చుకోలేకపోయింది. చివరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి. వేణుగోపాల్ రంగంలోకి దిగడంతో పాటు ఆశావహులను, అసంతృప్తులతో చర్చలు జరిపి చివరకు పెండింగ్ స్థానాల అభ్యర్థులతో పాటు పటాన్‌చెరు అభ్యర్థిని ప్రకటించారు. చార్మినార్ నుంచి ముజీబ్ షరీఫ్‌ను, సూర్యాపేట నుంచి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మిర్యాలగూడ నుంచి బాతుల లకా్ష్మరెడ్డి, తుంగతుర్తి నుంచి మందుల శ్యాముల్‌ను అభ్యర్థులుగా ఎంపిక చేసింది. సిపిఎంతో పొత్తుకోసం చివరివరకు మిర్యాలగూడను పక్కనపెట్టింది. సిపిఎంతో పొత్తు లేకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రస్తుతం లక్ష్మారెడ్డిని బరిలోకి దించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News