Friday, December 20, 2024

కాంగ్రెస్ క్షిపణులతో దాడిచేస్తే… రైఫిల్‌తో బదులిచ్చా

- Advertisement -
- Advertisement -

Congress fired missiles at me, I only retaliated with 303 rifle

మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్

బదేర్హా: కాంగ్రెస్ నేతలు తనపై క్షిపణులతో దాడిచేస్తే తను రైఫిల్‌తో బదులిచ్చాను అని మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ అన్నారు. కాంగ్రెస్‌తో ఐదు దశాబ్దాల అనుబంధాన్ని ఇటీవల ఆజాద్ తెగదెంపులు చేసుకున్నారు. జమ్ము కాశ్మీర్లో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు నాపై క్షిపణులను పేల్చారు. తను కేవలం 303రైఫిల్‌తో ఎదురుదాడి చేస్తే వారంతా ధ్వంసమయ్యారన్నారు. దివంగత ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీపై చేసిన వ్యాఖ్యలపై మాట్లాడేందుకు నిరాకరించారు. అయితే అంతకుముందు ఆజాద్ మాట్లాడుతూ 52సంవత్సరాలు కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నా రాజీవ్‌గాంధీని సోదరుడిలా, ఇందిరాగాందీని తల్లిలా భావించాను అన్నారు. జమ్ము కాశ్మీర్ రాష్ట్ర పునరుద్దరణే లక్షంగా పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన అనంతరం ఆజాద్ బహిరంగ సమావేశంలో మాట్లాడటం ఇదే ప్రథమం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News