Saturday, December 21, 2024

నలుగురు అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే ఎంపి అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన ఎఐసిసి ఎట్టకేలకు శుక్రవారం అభ్యర్థుల మొదటి జాబితాను విడుదలచేసింది. దేశవ్యాప్తంగా 36 మందితో కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేయగా అందులో తెలంగాణ నుంచి నాలుగు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి సురేష్ షెట్కార్, మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానానికి వంశీచంద్‌రెడ్డి, నల్గొండ స్థానానికి కుందూరు రఘువీర్‌రెడ్డి, మహబూబా బాద్ పార్లమెంట్ స్థానానికి బలరాంనాయక్ పేర్లను ఎఐసిసి ప్రకటించిది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News