Monday, December 23, 2024

అరువు గుర్రాలతో కాంగ్రెస్ పరుగు

- Advertisement -
- Advertisement -

(అంబుజి ప్రసాద్/నిజామాబాద్ బ్యూరో): వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్షంగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి అభ్యర్థుల కోసం పక్క పార్టీల వైపే చూడాల్సి వచ్చింది. ఏళ్ల తరబడిగా పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న నేతలను కాదని అరువు నేతలనే గెలుపు గుర్రాలుగా భావించింది. సర్వేలే ప్రామాణికం మని పైకి చెప్తున్నా ఆర్థిక సామాజిక నేపథ్యాలనే గీటురాయిగా తీసుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలు ండగా అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. కానీ ఇందులో అయిదుగురు పక్క పార్టీల నుంచి వచ్చిన వారే ఉన్నారు. అది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నెల రోజుల్లోపే టికెట్లు దక్కాయి. ఇందులో ఇద్దరు మాజీ మంత్రులే ! అందులో షబ్బీర్ అలీ కామారెడ్డి కాకుండా నిజామాబాద్ అర్బన్ నుంచి టికెట్ దక్కింది. సుదర్శన్ రెడ్డి (బోధన్), భూపతిరెడ్డి (నిజామాబాద్ రూరల్)లకు మాత్రమే పాత సెగ్మెంట్‌లలోనే టికెట్ దక్కింది. మిగతా స్థానాల్లోనూ అరువు నేతలకే టికెట్‌లు దక్కాయి. దీంతో ఏళ్ల తరబడిగా అనేక ప్రతికూల పరిస్థితులను అధిగమించి పార్టీలో కొనసాగుతున్న కీలక నేతలను సర్వేల వంకతో పక్కకు పెట్టేసి అరువు నేతలకు అవకాశం ఇవ్వడం ఆ పార్టీలో కల్లోలం రేపింది.

రగిలిపోతున్న సీనియర్లు
గెలుపు గుర్రాల పేరుతో కొత్త నేతలనే నెత్తిన పెట్టుకోవడం సీనియర్ నేతలు రగిలి పోతున్నారు. నిజానికి గత పదేళ్లుగా ఆయా నియోజక వర్గాల్లో క్యాడర్‌తో మమేకం అయి పని చేస్తున్న నేతలను కాదని ఇతర పార్టీల నేతలకు టికెట్లు ఇవ్వడం గమనార్హం. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ రూ రల్‌లో భూపతిరెడ్డి, బోధన్‌లో సుదర్శన్‌రెడ్డిలకు మాత్రమే అంచనాల మేరకు టికెట్‌లు వచ్చాయి. అలాగే కామారెడ్డిలో టికెట్ ఆశించిన షబ్బీర్ అలీ అక్కడ సిఎం కెసిఆర్ రంగంలోకి దిగడంతో పోటీకి వెనుకాడ౩రు. వరుసగా నాలుగు పర్యాయాలు ఓటమి చెందిన షబ్బీర్ ఈసారి కెసిఆర్‌ని ఢీకొట్టడానికి నసేమిరా అన్నారు. అందుకే అనూహ్యంగా నిజామాబాద్ అర్బన్ బరిలోకి దిగారు. ఎల్లారెడ్డిలో గతంలో పోటీ చేసిన సుభాష్‌రెడ్డిని కాదని ఎంపిగా పోటీ చేసి ఓడిపోయిన మదన్‌మోహన్ రావుకు టికెట్ ఖరారు చేశారు. దీనితో సుభాష్‌రెడ్డి కన్నీళ్ల పర్యంతం అయ్యారు. పార్టీ వీడారు. బిజెపి నేత మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి నామినేషన్లు మొదలైన రోజే బిజెపిని వీడి రాజగోపాల్ రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆయనను బాన్సువాడ అభ్యర్థిగా ఖరారు చేశారు. దశాబ్ద కాలంగా పార్టీలో ఉంటూ రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన కాసుల బాలరాజుకు హ్యాండ్ ఇచ్చేసి రవీందర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో బాలరాజు తీవ్ర మనస్థాపం చెందారు.

ఏకంగా పురుగుల మందు తాగి ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారు. మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయ చేస్తున్నారు. అలాగే జుక్కల్‌లో మాజీ ఎమ్మెల్యే గంగారాం టికెట్ కోసం గట్టిగా పట్టుబట్టారు. సర్వే సానుకూలంగా లేదంటూ పక్కకు పెట్టారు. కానీ టికెట్ కోసం మాజీ డిసిసి అధ్యక్షుడు గడుగు గంగాధర్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. వీరిద్దరిని కాదని ప్రవాస భారతీయుడు క్ష్మీకాంత రావుకు అనూహ్యంగా టికెట్ ఇచ్చారు. నిజానికి ఆయన కులం పై వివాదం ఉన్నప్పటికీ అధిష్టానం లైట్ తీసుకుంది. ఆయన ఆర్థికంగా బలంగా ఉండడం వల్లే టికెట్ ఇచ్చారనే ఆరోపణలున్నాయి. బాల్కొండలోనూ అదే జరిగింది. డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి రెండేళ్లుగా ఆ సెగ్మెంట్‌లో మకాం వేసి పని చేస్తున్నారు. చివరిదాకా బిజెపిలో చేరడానికి పైరవీలు చేసి బెడిసి కొట్టడంతో కాంగ్రెస్‌లో చేరిన ఆరెంజ్ సునీల్ రెడ్డికి నెలరోజులకే టికెట్ ఇచ్చేసారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మాజీ విప్ అనిల్ సైతం టికెట్ కోసం దరఖాస్తు చేసిన ఆర్థిక ఇబ్బందులతో వెనక్కి తగ్గారు. రైతు ఉద్యమ నేత అన్వేష్‌రెడ్డి కూడా టికెట్ ఆశించారు.

అలాగే ఆర్మూర్‌లోనూ ఇదే జరిగింది. బిజెపి నేత వినయ్‌రెడ్డికి టికెట్ కట్టబెట్టారు. ఆయన పార్టీలో చేరడానికి ముందే గాంధీ భవన్ వెళ్లి టికెట్ కోసం దరఖాస్తు చేశారు. పార్టీ కండువా వేసుకున్న పదిరోజుల్లోపే ఆయనకు టికెట్ కట్టబెట్టారు. అర్బన్‌లో అర డజన్ మంది సీనియర్ నేతలు టికెట్ కోసం ఆశలు పెట్టుకుంటే కామారెడ్డి టికెట్ కోసం దరఖాస్తు చేసిన షబ్బీర్‌కు అర్బన్ టికెట్ ఇచ్చారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్‌గౌడ్, డిఎస్ తనయుడు మాజీ మేయర్ సంజయ్‌లను కాదని కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డిని రంగంలోకి దింపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News