Sunday, November 17, 2024

పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్

- Advertisement -
- Advertisement -

గెలుపు గుర్రాల కోసం అన్వేషణ
నేడు బూత్‌స్థాయి ఏజెంట్లతో
ఎల్‌బి స్టేడియంలో ఎఐసిసి
అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమావేశం

మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఎన్నికలకు సమయం దగ్గర ప డుతుండటంతో అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ దృష్టి సారించింది. గెలుపు గుర్రాల కోసం అన్వేషణ ప్రారంభించింది. ఇప్పటికే సిఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాల ప రిధిలోని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ బలబలాలపై జిల్లా, ఇంఛార్జీమంత్రులతో ఆరా తీశారు. ఈనెల 26 నుంచి క్షేత్రస్థాయిలో సిఎం రేవంత్ పర్యటించనున్నారు. బూత్‌స్థాయిలోని ఏజెంట్లు కీలకంగా వ్యవహరించడంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజ యం సాధించామన్న భావన కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోం ది. పార్లమెంట్ ఎన్నికల్లో వారి సేవలను సమర్ధంగా వినియోగించుకునేలా నాయకత్వం ప్రణాళికలు రెడీ చే స్తోంది. అందులో భాగంగా గురువారం బూత్‌స్థాయి ఏ జెంట్లతో ఎల్బీస్టేడియంలో ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జు న ఖర్గే సమావేశమవ్వ నున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సిఎం, డిప్యూటీ సిఎంలు వారికి దిశానిర్దేశం చేయనున్నారు.

మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో బ లమైన అభ్యర్థుల కోసం కాంగ్రెస్ రాష్ట్రనాయకత్వం అ న్వేషణ సాగుతోంది. మొత్తం 17 స్థానాల్లో ఇద్దరు నుంచి నలుగురు టికెట్ ఆశిస్తున్నారు. వరంగల్ స్థానం ఎస్‌సికి రిజర్వ్ అయినందున అద్దంకి దయాకర్‌ని బరిలో దింపే యోచనలో ఉండగా మరో మాజీ ఎంపి సిరిసిల్ల రాజ య్య టికెట్ ఆశిస్తున్నారు. నాగర్‌కర్నూల్ నుంచి పోటీకి సంపత్‌కుమార్, మల్లురవితోపాటు చారకొండ వెంకటేశ్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఎస్‌టి రిజర్డ్ స్థానాలైన ఆదిలాబాద్ నుంచి నరేష్ జాదవ్, సేవాలాల్ రాథోడ్ మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, మాజీ పోలీస్‌అధికారి కాశీరాంనాయక్ టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఖమ్మం నుంచి పోటీకి ఎఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చొరవ చూపుతున్నట్లు పా ర్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఒకవేళ ఆమె రాకపోతే రేణుకాచౌదరి, విహెచ్, పొంగులేటి ప్రసాద్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన ఫిరోజ్‌ఖాన్, అజహరుద్దీన్‌తో పాటు పొత్తులో భాగంగా ఎంబిటికి ఇచ్చే అవకాశముందని సమాచారం. కరీంనగర్ నుంచి ప్రవీణ్‌రెడ్డి, ఎంఎల్‌సి జీవన్ రెడ్డి, కాంగ్రెస్‌వార్ రూమ్‌లో కీలకంగా పనిచేసిన సంతోష్‌రుద్ర మహిళ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు నేరెళ్ల శారద టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. పెద్దపల్లి టికెట్ గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీ, మాజీ మంత్రి చంద్రశేఖర్ ఇవ్వాలని కోరుతున్నారు. నిజామాబాద్ నుంచి ఈరవత్రి అనిల్, కరీంనగర్ లేదా నిజామాబాద్ బరిలోకి దిగే అవకాశం ఉందని స్వయంగా జీవన్‌రెడ్డి చె బుతున్నారు. ఆ స్థానాన్ని ఆరంజ్ ట్రావెల్స్‌అధినేత సునీల్‌రెడ్డి, సినీ నిర్మాత దిల్‌రాజ్ ఆశిస్తున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.

మెదక్ నుంచి జగ్గారెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కుమార్తె త్రిష లే దా జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, మంత్రి రాజనర్సింహ కుమార్తె త్రిష టికెట్ ఆశిస్తున్నారు. మల్కాజిగిరి నుంచి హరివర్దన్‌రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు బరిలో దిగాలని యోచిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి యువజన కాంగ్రెస్ నాయకుడు అనిల్‌కుమార్ యాదవ్, రోహిణ్‌రెడ్డి, మాజీ ఎమ్మె ల్యే కోదండరెడ్డి, చార్టెడ్ అకౌంటెంట్ వేణుగోపాల్ స్వా మి టికెట్ ఆశిస్తున్నవారిలో ఉన్నారు.

చేవెళ్ల నుంచి పారిజాత నర్సింహారెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ కేఎల్‌ఆర్ పోటీ పడుతున్నారు. మహబూబ్‌నగర్ నుంచి ఎంఎస్‌ఎన్ ఫార్మా అధినేత జీవన్‌రెడ్డితోపాటు మాజీ ఎంఎల్‌ఎ వంశీచంద్‌రెడ్డి మాజీ మంత్రి చిన్నారెడ్డి కుమారుడు ఆదిత్యరెడ్డి, సీతాదయాకర్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. నల్గొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి, ఆయన కుమారుడు రఘువీర్‌రెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. భువనగిరి నుంచి పిసిసి ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్‌రెడ్డి, పున్నా కైలాష్ నేతలతోపాటు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి కుమారుడు డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News