Wednesday, January 22, 2025

గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ అండ

- Advertisement -
- Advertisement -

6 గ్యారంటీలు పక్కాగా అమలు చేసి తీరుతాం
కామారెడ్డి రోడ్‌షోలో పిసిసి ఛీప్ రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/కామారెడ్డి/రాజంపేట్: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందని పిసిసి చీఫ్, కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం కామారెడ్డి నియోజకవర్గ పర్యటనలో భాగంగా రాజంపేట్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కామారెడ్డి భవిష్యత్ పూర్తిగా ఈ ఎన్నికలపై ఆధారపడి ఉందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గల్ఫ్ కార్మికులను ఆదుకునే కార్యక్రమం చేపడుతామని అన్నారు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి 20 ఏండ్లుగా ప్రశ్నించే గొంతుక అని, ఎన్ని కేసులు పెట్టి భయపెట్టినా భయపడలేడని అన్నారు. గల్ఫ్ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి వారికి వారి పిల్లలకు అండగా ఉంటామని, బీడీ కార్మికులకు  ఆదుకుంటామన్నారు.

ఆరు గ్యారంటీల పథకాలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అండగా ఉం టామని, రూ. 500కే సిలిండర్ ఇచ్చి తీరుతామని రైతు భరోసా కింద రైతులకు అండగా ఉంటామని ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి తెలంగాణలో అధికారం ఇవ్వాలని ప్రజలకు కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరళ్ల శారద, మాజీ మంత్రి షబ్బీర్ యూసుఫ్ అలీ, అర్కెల నర్సారెడ్డి, సీనియర్ నాయకులు వీరన్న పటేల్, కాంగ్రెస్ అధ్యక్షుడు యాదవరెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణారావు, పట్టణ అధ్యక్షుడు గంగాధర్ గౌడ్, సుధాకర్ రెడ్డి, మేకల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News