Thursday, January 9, 2025

ఆదివాసీ గిరిజనులకు కాంగ్రెస్ అండ

- Advertisement -
- Advertisement -
  • తండా నిద్రలో పాల్గొన్న ఎర్రబెల్లి స్వర్ణ

పర్వతగిరి: ఆదివాసీ గిరిజన దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తండా నిద్ర నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు. అందులో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం పెద్ద తండా గ్రామంలో తండా నిద్ర కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రబెల్లి వరద రాజేశ్వర్‌రావు, వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి నమిండ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆదివాసీ గిరిజనులకు మొదటి నుంచి అండగా ఉన్నది కాంగ్రెస్ మాత్రమే అన్నారు. రాబోయే రోజుల్లో గిరిజనుల పక్షాన నిలబడి వారి హక్కులు నేరవేర్చేది కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పక్షాన మీరు నిలబడాలని సోనియా గాంధీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందన్నారు.

అనంతరం తండావాసులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్‌నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్‌రావు, పర్వతగిరి ఎంపీటీసీ బొట్ల మహేంద్ర, మహిళా అధ్యక్షురాలు సువర్ణ, లచ్చునాయక్, భాస్కర్, బిక్షపతి, గ్రామ పార్టీ అధ్యక్షుడు భూక్య వీరన్న, మోహన్, బేబీ చందు, పూల్‌సింగ్, బిచ్చ, కిషన్, రమేశ్, సుఖ్య, సూర్య, మోహన్, రవి, యాకు, బాలు, మోహన్, రాజేందర్, బుచ్చ పాల్గొన్నారు.
దూప తండాలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని తెలియచేస్తూ గడప గడపకు కాంగ్రెస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రబెల్లి వరద రాజేశ్వర్‌రావు, వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి నమిండ్ల శ్రీనివాస్ తండావాసులతో మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్‌రావు, బిక్షపతి, దూపతండా కాంగ్రెస్ అధ్యక్షుడు ధరంసోత్ తిరుపతి, ఉపాధ్యక్షుడు సోమోజీ, యూత్ అధ్యక్షుడు వెంకన్న, విజయ్‌కుమార్, రాజేందర్, నాగన్న, రాజేందర్, అనిల్, రాజేందర్, యువ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News