Friday, December 27, 2024

సోనియా నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశం పేరును ఇండియాకు బదులుగా భారత్‌గా మార్చబోతోందంటూ ఊహాగానాలు బలంగా వినిస్తుండడంతో విపక్షాలు సైతం అప్రమత్తమైనాయి. ఒక వేళ ఇండియా పేరును భారత్‌గా మారిస్తే ఏం చేయాలనే దానిపై అత్యవసర సమావేశాలు జరుపుతున్నాయి. మంగళవారం రాత్రి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతలు సోనియా గాంధీ నివాసంలో అత్యవసరంగా సమావేశమై ఇదే అంశంపై చర్చించారు. వచ్చే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశ పెడితే

అనుసరించాలిన వ్యూహంతో పాటుగా కూటమి పేరులోనూ ఏవైనా మార్పులు చేయాల్సి ఉంటుందా అనే విషయంపై నేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సమావేశం అనంతరం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి పార్టీలకు చెందిన నేతలు కూడా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. జి20 దేశాధినేతలకు ఇచ్చే విందు కోసం పంపిన ఆహ్వానపత్రాల్లో రాష్ట్రపతి తనను ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా పరిచయం చేసుకోవడంతో దేశం పేరును ండియాకు బదులుగా భారత్‌గా మార్చడానికి కేంద్రం సిద్ధమవుతోందనే ఊహాగానాలు మొదలయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News