హైదరాబాద్: రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్షేమానికి స్వర్ణయుగం, అభివృద్ధికి పెద్దపీట అని మంత్రి కెటిఆర్ అన్నారు. రాష్ట్రానికి అప్పుల పాలు చేశారన్న ఆరోపణలు సరికాదని ఆయన హెచ్చరించారు. రుణాలు తెచ్చి ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టామని సూచించారు. రుణాల మొత్తం సాగునీటి రంగం, మిషన్ భగీరథకు వినియోగించామన్నారు.
సోనియాగాంధీ బలిదేవత అని రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని మంత్రి కెటిఆర్ గుర్తుచేశారు. ఎపిలో ఎలాగూ కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిందన్నారు. తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తాయని కాంగ్రెస్ ఆరాటపడుతోందని కెటిఆర్ ఎద్దేవా చేశారు. రాజకీయా స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఏడాదిలో 4.5 లక్షల ఉపాధి కల్పన జరిగిందన్నారు. హైదరాబాద్ నుంచే 1.5 ఉద్యోగాలు వచ్చాయని కెటిఆర్ తెలిపారు. దేశంలో మూడో వంతు ఉద్యోగాలు హైదరాబాద్ నుంచే వచ్చాయని వెల్లడించారు.