Wednesday, January 22, 2025

వస్తోంది.. వాస్తవిక బడ్జెట్!

- Advertisement -
- Advertisement -

అంకెలగారడీ లేకపోతే బడ్జెట్ తగ్గుతుంది! రెవెన్యూ మిగులు ఉండకపోవచ్చు? భారీగా తగ్గనున్న
ద్రవ్యలోటు నిజాల పునాదిపై 2024-25 బడ్జెట్ ఖజానా గుట్టు తెలిపే వార్షిక ప్రణాళిక

(సిహెచ్. శ్రీనివాసరావు)
రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పనలో అన్నీ నిజాలు, వాస్తవాలే ఉండాలని ఆదేశించడంతోపాటుగా ఖజానాకు వచ్చే ఆదాయం ఏయే మార్గాల నుంచి ఎంత వస్తుంది. ఖజానాకు వచ్చిన నిధుల్లో ప్రతి రూపాయినీ ఏ విధంగా ఖర్చు పెట్టబోతున్నామనే అంశాలన్నీ కళ్లకు కట్టినట్లుగా రాష్ట్రంలోని సామాన్య ప్రజల నుంచి మేధా వి వర్గం వరకూ అత్యంత సులభంగా అర్థమయ్యే లా బడ్జెట్‌ను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థ్ధికశాఖ అధికారులు తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తున్నారు. అన్నీ నిజాలతోనే బడ్జెట్‌ను రూపొందించాల్సి రావడమంటే ఎంతో కష్టమని కొందరు సీనియర్ అధికారులు అంటున్నారు.

అంకెలగారడీ లేకుండా, ఏతులకు (ఎచ్చులకు) పోకుండా బడ్జెట్‌ను తయారు చేయడం తమకు సవాల్‌గా మారిందని, ఎసి గదుల్లో కూర్చొని దేశంలోనే రె వెన్యూ మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం అలవాటైన తమకు ఇప్పుడు వాస్తవిక బడ్జెట్‌ను రూపొందించాల్సి రావడంతో ఆదాయ, వ్యయాలపై నిజాయితీగా లెక్కలు వేయాల్సి వస్తోందని, అందుకే ఫిబ్రవరి మూడో వారం వరకూ పూర్తిస్థాయి బడ్జెట్ స్వరూపం ఒక కొలిక్కి వచ్చేటట్లుగా కనిపించడం లేదని ఆ అధికారులు వివరించారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వానికున్న లక్షాలు, ప్రజలకిచ్చిన హామీలన్నీ సొంత ఆదాయంపైనే ఆధారపడి ఆరు గ్యారెంటీలను అమ లు చేయాల్సి ఉన్నందున ఈసారి రెవెన్యూ మిగు లు చూపించలేకపోవచ్చునని, కనీసం 15 వేల నుంచి 20 వేల కో ట్ల రూపాయల వర కూ రెవెన్యూ లోటు ఉండే అవకాశాలు మెం డుగా ఉన్నాయని అంటున్నారు.

అంతేగాక మన రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలకు వచ్చే నిధుల్లో భారీగా కోతలు పడ్డాయని, ఆ మేరకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా గణనీయంగా తగ్గిపోయాయని గ త రెండు సంవత్సరాలలోనూ స్పష్టమైందని, అం దుచేతనే ఈసారి కేంద్ర పథకాలకొచ్చే నిధులు, వాటికి మన రాష్ట్రానికి వచ్చే డబ్బులు ఎంత ఉండవచ్చుననే అంశాలను క్షుణ్ణంగా లెక్కలుగట్టిన త ర్వాతనే ఆయా పథకాలకు మన రాష్ట్రంలో కేటాయింపులు చేయాల్సి ఉంటుందని వివరించారు. అంతేగాక కేంద్ర ప్రభుత్వం దేశ ప్ర జల నుంచి వసూలు చేస్తున్న పన్నుల ఆదాయంలో మన రాష్ట్రానికి రావాల్సిన వాటా నిధుల్లో కూడా కోతలు విధించడంతో గడచిన రెండేళ్లలో భారీగా కేం ద్రం నిధులు తగ్గాయని, ఈసారి బడ్జెట్ లో పన్నుల ఆదాయంలో మన రాష్ట్రానికి వచ్చే వాటా నిధులను పక్కాగా లెక్కగట్టి, ఆ తర్వాతనే బడ్జెట్‌లో పొందుపరుస్తామని వివరించారు.

అందుచేతనే ఫిబ్రవరి, మార్చి నెలలో జరుగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా రెవెన్యూ మిగులు అనే ప్రస్తావన లేకుండా, ద్రవ్యలోటును కూడా తగ్గించుకొని అందుబాటులో ఉన్న నిధులతోనే కేటాయింపులు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని వివరించారు. అంతేగాక దేశంలోని 14 రాష్ట్రాలకు రెవెన్యూలోటును భర్తీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం గ్రాంట్‌గా నిధులను విడుదల చేస్తూ వస్తోంది. 2015-16వ ఆర్థిక సంవత్సరంలో ఏడు రాష్ట్రాలకు రెవెన్యూ లోటును భర్తీ చేసే బాధ్యతను చేపట్టిన కేంద్రం 2023వ ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి రెవెన్యూ లోటున్న రాష్ట్రాల సంఖ్య 14కు చేరినప్పటికీ కేంద్రం రెవెన్యూ లోటు భర్తీ చేస్తూ నిధులను విడుదల చేస్తూ వస్తోంది. ఇప్పటి వరకూ సుమారు రూ.90 వేల కోట్లను రెవెన్యూ లోటున్న రాష్ట్రాలకు గ్రాంట్ రూపంలో ఆర్థిక సహాయం చేస్తూ వచ్చిందని, కానీ తెలంగాణ రాష్ట్రం ఎచ్చులకుపోయి అంకెలగారడీతో రెవెన్యూ మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం మూలంగా 2015వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ పదేళ్లల్లో కనీసం రూ.15వేల కోట్లను నష్టపోయి ఉంటామని ఆ అధికారులు వివరించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరమైన 2023-24లో ఏకంగా రూ.4881 కోట్ల 74 లక్షల రెవెన్యూ మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని, కానీ వాస్తవానికి వచ్చేసరికి, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 31వ తేదీ నాటికి రెవెన్యూ మిగులు మాట దేవుడెరుగు కనీసం రూ.3605 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతోందని, ఈ విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సిఎజి-కాగ్)కు కూడా నివేదించామని ఆ అధికారులు వివరించారు. అంతేగాక గత బడ్జెట్‌లో గ్రాంట్ -ఇన్ -ఎయిడ్ కింద కేంద్రం నుంచి ఏకంగా రూ.41,259 కోట్ల 17 లక్షల నిధులు రాష్ట్రానికి వస్తాయని బడ్జెట్‌లో పెట్టుకొన్నామని, కానీ వాస్తవానికి వచ్చేసరికి, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి గాంట్ ఇన్- ఎయిడ్ నిధులు కనీసం 9వేల కోట్లు కూడా వచ్చే అవకాశం లేదని, దాంతో ఏకంగా రూ.32,259 కోట్ల లోటు ఏర్పడిందదన్నారు.

ఈ లోటు భారమంతా ద్రవ్యలోటుగా మారిపోయిందని, ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధులను కేటాయించలేకపోయామని, దాంతో తప్పనిసరిగా తలకుమించిన స్థాయిలో అప్పులు చేయాల్సి వచ్చిందని ఆ అధికారులు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా సుమారు రూ.34 వేల కోట్ల లోటు ఉంటుందని తెలిపారు. అంతేగాక కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటాలో రాష్ట్రాలకు 41 శాతం నిధులు రావాల్సి ఉందని, ఆ లెక్కన తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర నిధుల్లో న్యాయంగా 2.6 శాతం నిధులుమన రాష్ట్రానికి రావాల్సి ఉందని, కానీ ఆ మేరకు నిధులు రావడంలేదని, కేవలం 29.1 శాతం నిధులే వస్తున్నాయని, ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రకాల అంకెల గారడీకి పాల్పడిందని, రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధుల్లో కోతలు విధించడానికి సెస్, సర్‌చార్జిలనే పదాలను వినియోగిస్తూ రాష్ట్రాల నోళ్ళు కొడుతోందని వివరించారు.

ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవాలు, నిజాలతో కూడిన బడ్జెట్‌ను తయారు చేయాలంటే అన్ని శాఖల వారీగా నిజంగా ఖర్చు చేస్తున్న నిధులు ఎంత, ఏయే పథకానికి ఎన్నెన్ని నిధులు కావాలి, ఆయా శాఖల నిర్వహణకు అయ్యే ఖర్చులు, ఉద్యోగుల జీతభత్యాలకు అవుతున్న ఖర్చులన్నింటినీ తెప్పించుకొంటున్నామని, ప్రస్తుతం ఆర్ధికశాఖామంత్రి మల్లు భట్టి విక్రమార్క శాఖల వారీగా నిర్వహిస్తున్న బడ్జెట్ సమీక్షా సమావేశాల్లో ఈ అంశాలనే రాబట్టుకొంటున్నామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News