Sunday, September 8, 2024

టైమ్ స్కేర్ తరహాలో రాయదుర్గంలో టి స్క్వేర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరో ఐకానిక్ టవర్ రా బోతుంది. అమెరికాలోని న్యూయార్క్‌లో ఫేమస్ అయిన టైమ్స్ స్క్వేర్ తరహాలో టిస్క్వేర్‌ను నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ ఐకానిక్‌లా కనిపించే విధంగా తెలంగాణ స్క్వేర్ పేరుతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాని కోసం తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టిజిఐఐసి) టెండర్లను ఆహ్వానించింది. నగరంలోని రా యదుర్గం, హైటెక్ సిటీ ప్రాంతాల్లో టిస్క్వేర్ నిర్మా ణం చేపట్టనుంది. టిస్క్వేర్ ప్రాజెక్టు కోసం ఆగస్టు 9 వ తేదీ వరకు బిడ్లను సమర్పించేందుకు చివరి తేదీని టిజిఐఐసి ప్రకటిచింది.

ఆర్కిటెక్ కమ్ ట్రా న్సాక్షన్ అడ్వైజర్ ఎంపిక విధానం క్వాలిటీ కమ్ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ (క్యూసిబిసి) అని స్పష్టం చే సిం ది. ఈ ప్రాజెక్టు లక్ష్యం సమాజానికి సౌకర్యవంతమైన, ఆకర్షణీయమైన వాతావరణాన్ని అందించ డం అని తెలిపింది. కాగా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ గురించి అందరికీ తెలిసిందే. ఒక ప్రధాన వాణిజ్య కూడలి, ఫేమస్ పర్యాటక, వినోద కేం ద్రం. వీడియో బిల్ బోర్డులతో ప్రకటనలతో 24 గంటలు ప్రకాశవంతంగా వెలిగిపోతుంది. ఇక్కడికి ప్రతి సంవత్సరం 50 మిలియన్ల మంది సందర్శిస్తుంటారని నివేదికలు చెబుతున్నాయి. ఈ క్ర మంలోనే టిస్క్వేర్ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభు త్వం శ్రీకారం చుట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News