భీమ్‌గల్ : మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిసిసి అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ భీమ్‌గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొదిరే స్వామి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్‌ఎస్, బిజెపి పార్టీ రెండు ఒకటేనని, వారిది ఫెవికాల్ బంధమని, అందుకు నిదర్శనమే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని మార్చడమే దీనికి నిదర్శనం అన్నారు. వెనుకబడిన కులానికి చెందిన బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన తర్వాత బిజెపి అభివృద్ధికి అనేక రకాల కృషి చేసిన ఆయనని మార్చి కెసిఆర్ కనుసనల్లో ఉండే వ్యక్తిని నియమించడం జరిగిందన్నారు.
ఇది ఓర్వలేని కెసిఆర్ అమిత్‌షాతో బండి సంజయ్‌ని తప్పించి కిషన్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా నియమించాడన్నారు. దీని ద్వారా తెలంగాణ ప్రజలందరికి అర్థమైన విషయం ఏమిటంటే బిజెపి, బిఆర్‌ఎస్ ఒకటేనని తెలిసిపోయిందని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఈ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని జోష్యం చెప్పారు. విద్యార్థులు పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ యూనివర్సిటీకి పూర్తి స్థాయి విసి, రిజిస్టర్ ఇప్పటికి కూడా లేకపోవడం తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల దౌర్బాగ్యం అని, యూనివర్సిటీ అంత అవినీతిలో కూరుకపోయిందని, దీన్ని పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడని, ఇప్పటికైనా జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి కలుగజేసుకొని యూనివర్సిటీలో అవినీతికి అడ్డుకట్ట వేయాలని విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగం ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం కొనసాగుతుందని మంత్రి వేములకి ఈ సందర్భంగా హెచ్చరించారు.
కార్యక్రమంలో డిసిసి డెలిగేట్ కుంట రమేష్, బాల్కొండ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేంద్ర, పట్టణ అధ్యక్షుడు జెజె నరసయ్య, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు అనంతరావు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు గోపాల్ నాయక్, డిసిసి యూత్ సెక్రెటరి వాకా మహేష్, మండల యూత్ అధ్యక్షుడు బద్దం అవినాష్, కిషన్ కేత్ జిల్లా సెక్రెటరి శివక్రాంతి, ఎన్‌ఎస్‌యుఐ జిల్లా సెక్రెటరి రెహమాన్, గోపి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.