Tuesday, April 15, 2025

బిఆర్‌ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పాలన: కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గతంలో ఉన్న బిఆర్‌ఎస్ పాలనకు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పాలనకు ఏ మాత్రం తేడా లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. బిఆర్‌ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పాలన ఉందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి, అప్పులు, అక్రమ భూముల వ్యవహారం, లిక్కర్ దోపిడి.. తదితర అంశాల్లో గత ప్రభుత్వంతో, ఈ ప్రభుత్వం పోటీ పడుతుందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో రేవంత్ ప్రభుత్వం రూ.1.52 లక్షల కోట్ల అప్పు చేసిందని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News