Saturday, April 5, 2025

ఆటో డ్రైవర్లను రోడ్డున పడేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను రోడ్డున పడేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం, దాని ప్రభావంతో రోడ్డున పడిన ఆటోడ్రైవర్లను పట్టించుకోవట్లేదని ఆయన అన్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 15వేల చొప్పున జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట డిగ్రీ కాలేజీ మైదానంలో ఆటో డ్రైవర్ల ఆటల పోటీలను ఆయన ప్రారంభించి, ప్రసంగించారు. ఒకరికి మంచి చేసిన ప్రభుత్వం, మరొకరి ఉసురు పోసుకోకూడదని హరీశ్ రావు హితవు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News