జ్ఞానానికి నిలయాలైన విశ్వవిద్యాలయాలను
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది
ప్రొఫెసర్ గోపాల్
విద్యార్థులకు హక్కులు లేకుండా చేస్తామనడం సమంజసం కాదు
సీనియర్ సంపాదకులు దేవులపల్లి అమర్
మన తెలంగాణ/పంజాగుట్ట : జ్ఞానానికి నిలయాలైన విశ్వవిద్యాలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ప్రొఫెసర్ గోపాల్ ఆరోపించారు. సోము చూడు ప్రెస్ క్లబ్లో విప్లవ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రౌండ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలను ప్రకృతిసంపదను కులగొట్టేప్రయత్నం చేస్తుందన్నారు. గతంలో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన భూములు హైకోర్టుకు కావాలని వంద ఎకరాలు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ లోరి 80 ఎకరాల్లో పది ఎకరాలు ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వానికి అవగాహణ లేకపోవడం పెద్ద విషాదమన్నారు. విశ్వవిద్యాలయాలు అరోగ్యంగా ఉంటే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. అలాంటి విశ్వవిద్యాలయాలను నిర్వీర్యంచేసే పనిలో ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. యూనివర్సిటీ అనేది సెల్ఫ్ గవర్నింగ్ ఇనిస్టిట్యూషన్ అని, తనకు తానే పరిపాలించుకునే సంస్థ అని అన్నారు. అందులో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. యూనివర్సిటీల్లో విద్యార్థులను ఉద్యమాలు చేయకుండా నిలువరిస్తే ఒక రోజు అది ఉవ్వెత్తున ఎగిసిపడుతుందన్నారు. విద్యార్ధులతో చర్చించి ఆ సర్క్యులర్లు వెనక్కి తీసుకోవాలన్నారు.
సీనియర్ సంపాదకులు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ విద్యార్థులు అకాడమిక్, అడ్మినిస్ట్రేషన్లు ఇబ్బంది కలుగకుండా మైదానాల్లో నిరసన తెలుపుకోవాలని సూచించడం హస్యాస్పదమన్నారు. అసలు సమస్యలే అందులో ఉంటాయని, విద్యార్థులకు హక్కులు లేకుండా చేస్తామనడం ఎంత వరకు సమజసమన్నారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా సాగుతున్నప్పుడు సకలజనుల్లో విద్యార్థులు కూడా భాగస్వాములయ్యారని గుర్తు చేశారు. తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, సీనియర్ సంపాదకులు కే శ్రీనివాస్, కవి రచయిత నందిని సిధారెడ్డి, నువ్వు డెమోక్రసీ నాయకులు చలపతిరావు, జర్నలిస్ట్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.