Sunday, December 22, 2024

ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది: ఎమ్మెల్యే రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది మాత్రమే ఉంటుందని తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి బిజెపి ప్రభుత్వం ఏర్పాటవుతుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పేర్కొన్నారు. బుధవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తమ పార్టీ కార్యాలయంలో నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చేలేక కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ అభివృద్ధి బిజెపితోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని మారుస్తానని ప్రకటించిన నాయకులనే తెలంగాణ ప్రజలు మార్చేశారని వ్యాఖ్యానించారు. దేశంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అందరూ నివాళులర్పిస్తున్నారని పేద ప్రజలు గర్వంగా జీవించడానికి, న్యాయం జరగడానికి అంబేద్కర్ కారణమని తెలిపారు. అందుకే అన్ని వర్గాలు అంబేద్కర్‌ను స్మరించుకుంటాయని పేర్కొన్నారు. బిజెపి ఒత్తిడితోనే హైదరాబాద్‌లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారన్నారు. దళితులను రేవంత్ మోసం చేస్తే బిజెపి వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అంబేద్కర్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి మోదీ అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News