Thursday, January 23, 2025

రానుంది కాంగ్రెస్ ప్రభుత్వమే

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: కేంద్రంలో రాష్ట్రంలో రానుంది కాంగ్రెస్ ప్రభుత్వమే అని కాంగ్రెస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీబీనగర్ మండల పరిధిలోని మహాదేవ్ పూర్ గ్రామంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సుమా రు ముప్పై మంది మునిగాళ్ల కృష్ణ,గంగయ్య,నగేష్,కృష్ణ,బాలరాజు,బాలయ్య, మల్లేష్,స్వామిలతో పాటు పలువురు నాయకులు,కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్నదని త్వరలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దండెం ప్రభాకర్ ,గాండ్ల రమేష్,భూపాల్ రెడ్డి,శివా రెడ్డి, వెంకటరామిరెడ్డి, సంజీవ, శేఖర్ రెడ్డి,జహంగీర్, రవీందర్, కరుణాకర్, వేణు,సురేందర్ రెడ్డి,యాది రెడ్డి, కొండల్,జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News