రైతు భరోసాపై రైతులకు కీలక అప్డేట్ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం, రైతు భరోసా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈనెల 26 నుంచి ఎకరాకు రూ.12 వేలు రైతుల ఖాతాలో జమా చేయనుంది. తాజాగా విడుదలైన మార్గదర్శకాల ప్రకారం.. భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే పెట్టుబడి సాయం అందిచంనున్నట్లు కాంగ్రెస్ సర్కార్ వెల్లడించింది. వ్యవసాయ యోగ్యం కాని భూములు రైతు భరోసా నుంచి తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది. అలాగే, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసాకు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. రైతు భరోసాపై ఫిర్యాదుల పరిష్కార బాధ్యత కలెక్టర్లకు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం.
కాగా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఎకరానికి రూ.12 వేలు మాత్రమే ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.