Monday, March 3, 2025

సర్పంచ్ ఎన్నికలపై సర్కార్ సందిగ్ధం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా ముందుకెళదామనుకుంటే అంత ఆల స్యం అవుతోంది.ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరిలో పంచాయతీలకు ఎన్నికలు ని ర్వహించాలనే పట్టుదలతో ఉన్న ప్రభుత్వానికి ఏదో ఒక రూపంలో అవాంత రం కలుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో శాసనమండలి ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో ఆ ప్రక్రియ మొత్తం మార్చి 8 వరకు కొనసాగుతుంది. ఇక బిసి రిజర్వేషన్లపై డెడికేషన్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతే తు ది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఫిబ్రవరి 2 లోపు ఈ నివేదిక అందుతుందని, ఆ ప్రకారం నివేదికను హైకోర్టుకు సమర్పించిన అనంతరం నిర్ణ యం వెలువడే వరకు మరింత సమయం పడుతుంది. దీంతో ప్రభుత్వం పం చాయితీ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధంలో ఉంది.

అంతేకాకుండా రాష్ట్ర ప్ర భుత్వం తాజాగా ప్రారంభించిన నాలుగు పథకాలను మార్చి నెలాఖరు వర కు అర్హులైన లబ్దిదారులకు అందజేస్తామని ప్రకటించింది. మండలంలోని ఒ క గ్రామం లెక్కన ప్రస్తుతం ఈ పథకాలను అమలు చేసిన ప్రభుత్వం అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని ప్ర కటించింది. ఈ ప్రకారం మార్చి చివరి వరకు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సానుకూల వాతావరణం కనిపించడం లేదు. దీంతో ఈ పరిస్థితిలో పంచాయతీ ఎన్నికల అంశంపై జాప్యం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా గత ఏడాది ఫిబ్రవరి1న సర్పంచ్‌ల పదవీకాలం ముగియగా ప్రత్యేక అధికార పాలన వచ్చింది. రెండు మూడు రోజుల్లో ప్రత్యేకాధికారుల పాలనకు ఏడాది పూర్తవుతుంది. అయితే రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే 15 రోజుల్లో ఎన్నికలు నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి.

బిసి రిజర్వేషన్లు అమలు పట్టుదలతో ప్రభుత్వం
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు ముందు బిసి రిజర్వేషన్లు 42 శాతం అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఎలాగైనా రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తోంది. అయితే డెడికేషన్ కమిషన్ నివేదిక ఈ నెల 2న మంత్రివర్గ ఉప సంఘానికి అందించిన అనంతరం ఆ నివేదిక కోర్టుకు అందజేసి అనుమతి పొందాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఆగితే మార్చి నెలాఖరుకే పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా ఫిబ్రవరి 2 తర్వాత మరోసారి సమావేశమై పంచాయతీ ఎన్నికలపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా మరో వైపు స్థానిక సంస్థల్లో

బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఉన్న అవకాశాలను కూడా ప్రభుత్వం అన్వేషిస్తోంది. రిజర్వేషన్లపై పాత పద్ధతిలోనే వెళ్లాలా, లేక న్యాయ స్థానాలలో పెంచుకునే అవకాశం పొందాలా అనే అంశంపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ విషయంలో లోతుగా న్యాయ నిపుణుల సలహా మేరకు ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. మొత్తం మీద పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునేందుకు డెడికేషన్ కమిషన్ నివేదిక కీలకంగా మారింది. రిజర్వేషన్ల వ్యవహారం, న్యాయపరమైన సమస్యలతో పంచాయతీ ఎన్నికల కసరత్తులో ఒడుదుడుకులు ఎదుర్కొంటోంది. త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News